Income tax returns
Income tax returns: 3 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలు: కేంద్రం
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి ఇప్పటి వరకు 3 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇప్పటి వరకు రిటర్నులు దాఖలు చేయని వారు వీలైనంత తొందరగా చేసుకోవాలని సూచించింది. 2020-21 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంది. రోజుకు 4 లక్షల రిటర్నులు దాఖలవుతున్నాయని, చివరి నిమిషయంలో గందరగోళం ఏర్పడకుండా పన్ను చెల్లింపుదారులు వీలైనంత తొందరగా రిటర్నులు దాఖలు చేయాలని ఆర్థిక శాఖ కోరింది. ఈ మేరకు పన్ను చెల్లింపుదారులకు ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్, మీడియా ద్వారా సమాచారం చేరవేస్తోంది.
ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఫారం 26 ఏఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్), ఇతర పత్రాలను తప్పకుండా సరి చూసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. మొత్తంగా దాఖలైన ఐటీ రిటర్నుల్లో 52 శాతం పోర్టల్‌లోని ఆన్‌లైన్ ఐటీఆర్ ఫారంను ఉపయోగించి చేశారని, మిగిలినవి ఆఫ్‌లైన్ సాఫ్ట్‌వేర్ యుటిలిటీ ద్వారా రూపొందించిన ఐటీఆర్ ఫారాలను ఉపయోగించారని పేర్కొంది. రిఫండ్స్ కోసం పాన్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతానే ఇవ్వాలని సూచించింది.
0 Response to "Income tax returns"
Post a Comment