Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Instructions on filling in the format given for allocating the required additional classrooms in the second installment Nadu-Nedu-in the context of Anganwadi Centers meeting in the primary school.

అంగన్వాడీ కేంద్రాలు ప్రాథమిక పాఠశాలలో కలుస్తున్న నేపధ్యంలో కావలసిన అదనపు తరగతి గదులను నాడు-నేడు రెండవ విడత లో కేటాయించుటకొరకు ఇచ్చిన ఫార్మేట్ నింపడంలో సూచనలు.

Instructions on filling in the format given for allocating the required additional classrooms in the second installment Nadu-Nedu-in the context of Anganwadi Centers meeting in the primary school.

ఈ ఫార్మేట్ లో 29 కాలమ్స్ ఇవ్వబడ్డాయి

  • 1 నుంచి 6 కాలమ్స్ సాధారణ సమాచారం 
  • 7వ గడిలో  యాజమాన్యం అనగా MPP.. GOVT.. GOVT TW.. AP RESIDENTIAL ఇలా
  •  8వ గడిలో పాఠశాల కేటగిరీ అనగా ప్రైమరీ.. UP.. 
  •  9వ గడిలో 1 నుంచి 5వ తరగతుల మొత్తం ఎన్రోల్మ్ంట్ వెయ్యాలి. 
  •  10వ గడిలో 1 మరియు 2 తరగతుల ఎన్రోల్మ్ంట్, 
  •  11వ గడిలో 3,4&5 తరగతుల ఎన్రోల్మ్ంట్ వెయ్యాలి. 
  • 12వ గడిలో 6వ గడిలో పేర్కొన్న పాఠశాలకు అసలు 1 కిలోమీటర్ పరిధిలోని వున్న అంగన్వాడీ కేంద్రాలు కలుస్తున్నాయా లేదా YES/NO తెలియజేయాలి.
  • 12వ గడిలో YES అని పెడితే, 13వ గడిలో ఆ పాఠశాలలో కలుస్తున్న అంగన్వాడీ కేంద్రం కోడ్ వెయ్యాలి. (మండల అంగన్వాడీ సూపర్వైజర్ దగ్గర నుంచి సేకరించాలి) 
  • 13వ గడిలో పేర్కొన్న అంగన్వాడీ కేంద్రం లోని పిల్లల సంఖ్య ను 14వ గడిలో వెయ్యాలి. 
  • 6వ గడిలో పేర్కొన్న ప్రాథమిక పాఠశాలలోకి ఎన్ని అంగన్వాడీ కేంద్రాలు మెర్జ్ అవుతున్నాయో ఆ సంఖ్యను 15వ గడిలో వెయ్యాలి. 
  • అయితే 6వ గడిలో పేర్కొన్న పాఠశాలలోని 3,4&5 తరగతులు ఒకవేళ ఒక కిలోమీటరు లోపు ఉన్నత పాఠశాలలోకి కలిస్తే 16వ గడిలోను లేదా ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల లోపున్న ఉన్నత పాఠశాలలో కలిస్తే 17వ గడిలోను వెయ్యాలి. 
  • ప్రాథమిక పాఠశాలలోని తరగతుల పిల్లలు మరియు ఆ పాఠశాల లో మెర్జ్ అయిన అంగన్వాడీ పిల్లల్ని కలిపి 18వ గడిలో వెయ్యాలి.

ఇక్కడ రెండు రకాలుగా చూడాలి

  • 1) ఆ ప్రాథమిక పాఠశాల నుంచి 3,4&5 తరగతులు 2 కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలలో మెర్జ్ అవుతూంటే
  • ఆ ప్రాథమిక పాఠశాలలోని 1 మరియు 2 తరగతుల పిల్లల్ని మరియు ఆ పాఠశాలలో కలుస్తున్న అంగన్వాడీ పిల్లల్ని total strength గా 18వ గడిలో వెయ్యాలి. 
  • 2) ఒకవేళ 3,4&5 తరగతులు మెర్జ్ అవకుండా అదే పాఠశాలలో వుండిపోయి అంగన్వాడీ కేంద్రం మెర్జ్ అవుతూంటే, 1 నుంచి 5 తరగతుల పిల్లలు మరియు ఆ పాఠశాలలోకి వస్తున్న అంగన్వాడీ పిల్లల్ని కలిపి total strength గా 18వ గడిలో వెయ్యాలి. 
  • 6వ గడిలో పేర్కొన్న ప్రాథమిక /ప్రాథమికోన్నత పాఠశాలలో  బోధనకు వినియోగిస్తున్న గదుల సంఖ్య (రిపేర్లు మరియు నిర్మాణం లో వున్నవి కలుపుకొని) 19వ గడిలో వెయ్యాలి. 
  • 20,21 మరియు 22గడులలో  కోలొకేటడ్ అంగన్వాడీ కేంద్రాల వివరాలు వెయ్యాలి (ఇక్కడ కోలొకేటడ్ అనగా పాఠశాల ప్రాంగణంలో వున్న అంగన్వాడీ కేంద్రాలు అని అర్థం) 
  • 20వ గడిలో  అసలు సదరు ప్రాథమిక /ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో అంగన్వాడీ కేంద్రం ఉందా.. లేదా YES/NO వ్రాయాలి. 
  • YES అయితే ఒక కేంద్రమా లేదా ఎన్ని కేంద్రాలు వున్నాయో ఆ సంఖ్య 21వ గడిలో వెయ్యాలి. 
  • ఇలా ప్రాంగణంలో వున్న అంగన్వాడీ కేంద్రాలకు వినియోగిస్తున్న గదుల సంఖ్యను మాత్రమే (ఒకవేళ ఆ అంగన్వాడీ కేంద్రాల నిమిత్తం పునాది లేదా ఆపైన నిర్మాణాలు చేబడుతూ వున్నా లేదా ఆగిన గదులను కూడా పరిగణించి) ఆ సంఖ్యను 22వ గడిలో వెయ్యాలి. 
  • ఇప్పుడు 6వ గడిలో పేర్కొన్న ప్రాథమిక /ప్రాథమికోన్నత పాఠశాలలో వున్న ఇతర అనగా HM/STAFF/LIB గదుల సంఖ్యను 23వ గడిలో వెయ్యాలి. 
  • ఇప్పుడు 19వ గడిలోను, 22వ గడిలోను మరియు 23వ గడిలోను వున్న గదుల సంఖ్యను కలిపి 24వ గడిలో వెయ్యాలి. (అంటే 24=19+22+23)
  •  25వ గడిలో  అంగన్వాడీ కేంద్రానికి 20 మంది పిల్లలు చొప్పున ఒక సెక్షన్ 25 దాటితే రెండు సెక్షన్ల చొప్పున సదరు ప్రాథమిక పాఠశాల నుంచి కలుస్తున్న 3,4&5 తరగతులు వేరే పాఠశాలకు వెళితే 1 మరియు 2వ తరగతుల సంఖ్య ప్రకారం 1:40 చొప్పున లేదా ఒకవేళ 3,4&5 తరగతులు అక్కడే వుంటే 1 నుంచి 5 తరగతుల సంఖ్య ప్రకారం 1:40 చొప్పున సెక్షన్ల సంఖ్య అన్నీ కలిపి  వెయ్యాలి. 

ఉదాహరణకు 

1వ తరగతి లో 60 మంది పిల్లలు వుంటే 2 సెక్షన్లు 

2వ తరగతి లో 100 మంది పిల్లలు వుంటే 3 సెక్షన్లు 

(3,4&5 తరగతులు ఉన్నత పాఠశాలలో విలీనమైనప్పుడు) 

అంగన్వాడీ పిల్లలు 40 మంది వస్తే 2 సెక్షన్లు మొత్తం 7 సెక్షన్లు వెయ్యాలి. అలాకాకుండా 5 తరగతులు అక్కడే వుంటే...

 ఉదాహరణకు 

1వ తరగతి లో 60 మంది పిల్లలు వుంటే 2 సెక్షన్లు 

2వ తరగతి లో 100 మంది పిల్లలు వుంటే 3 సెక్షన్లు 

3వ తరగతి లో 50 మంది పిల్లలు వుంటే 2 సెక్షన్లు

4వ తరగతి  లో 100 మంది పిల్లలు వుంటే 3 సెక్షన్లు

5వ తరగతి లో 40 మంది పిల్లలు వుంటే 1 సెక్షన్ అంటే మొత్తం 11 సెక్షన్లుగాను

అంగన్వాడీ పిల్లలు 40 మంది వస్తే 2 సెక్షన్లు గాను మొత్తం 11+2=13 సెక్షన్లు గా 25వ గడిలో వెయ్యాలి. 

18వ గడిలో వున్న మొత్తం స్ట్రంక్త్ ను 25వ గడిలో వున్న సెక్షన్ల సంఖ్య చే భాగించగా వచ్చే సంఖ్యను Average no of students per section అనగా ఒక సెక్షన్ కు సగటు పిల్లల సంఖ్య ను 26వగడి లో వెయ్యాలి (ఉదాహరణకు మొత్తం స్ట్రంక్త్ 390 సెక్షన్లు మొత్తం సెక్షన్లు 13 ఉంటే 390÷13=30 ను సగటు సెక్షన్ స్ట్రంక్త్ గా 26వ గడిలో వెయ్యాలి. 

27వ గడి అత్యంత ప్రాధాన్యత గల గడి  

25వ గడిలో పేర్కొన్న సెక్షన్ల సంఖ్య ప్రకారం గదుల సంఖ్యనుమపరిగణించాలి... అంటే ఉదాహరణకు 25వ గడిలో 13 సెక్షన్లు ఉంటే  13 గదులు వాటితోబాటు

ప్రధానోపాధ్యాయులుకు-1 గది

సిబ్బందికి-1గది మొత్తం ఆమసదరు పాఠశాలకు 15 గదులు ఉండడానికి అర్హత వుంది.. కాబట్టి 27వ గడిలో no of rooms required అంటే 15 సంఖ్య వెయ్యాలి. 

28వ గడిలో 27వ గడిలో చూపిన అర్హత వున్న గదుల సంఖ్య నుంచి 24వ గడిలో ఆ పాఠశాలలో వాస్తవంగా అందుబాటులో వున్న గదుల సంఖ్య ను తీసివేసి ఆ సంఖ్య ను 28వ గడిలో వెయ్యాలి. 

29వ గడిలో ఇప్పుడు 28వ గడిలో ప్రతిపాదించిన గదులకు ఖాళీ స్థలం కాని పాత భవనం పై ఒక గది కట్టుటకు లేదా కొత్తగా G+2 నిర్మాణాలకు స్థలం వుంటే YES అని ఏరకంగాను ఏమాత్రం గదులు 

నిర్మించడానికి జాగా లేకపోతే NO  అని వెయ్యాలి. 

ఒక తరగతిని రెండు లేదా అంతకన్నా ఎక్కువ సెక్షన్లుగా విభజించి ఆ ప్రాప్తికి గదుల ప్రతిపాదన చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు.1

ఈ యావత్ అభ్యాసం జిల్లాలో వున్న ప్రాథమిక /ప్రాథమికోన్నత పాఠశాలలకు 1 కిలోమీటర్ల పరిధిలో వున్న అంగన్వాడీ కేంద్రాలను దృష్టిలో వుంచుకుని నాడు-నేడు రెండవ దశలో అదనపు తరగతి గదులు కేటాయించడం కోసం చేసే ప్రతిపాదనలు. కాబట్టి మండలంలో వున్న అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు నాడు-నేడు మొదటి దశతో సంబంధంలేకుండా ఈ అభ్యాసం చెయ్యాలి. ఒకవేళ అంగన్వాడీ కేంద్రాలు సదరు ప్రాథమిక /ప్రాథమికోన్నత పాఠశాలలో కలవకపోయినాకూడా ఆ పాఠశాలలో వున్న తరగతి వారీ సంఖ్య మరియు అక్కడ వున్న గదుల సంఖ్యను తెలియజేస్తే అవసరం దృష్ట్యా అదనపు తరగతి గదులు కేటాయించవచ్చు.

నిర్వహణ సమాచార వ్యవస్థ మరియు ప్రణాళికా సమన్వయకర్త, 

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Instructions on filling in the format given for allocating the required additional classrooms in the second installment Nadu-Nedu-in the context of Anganwadi Centers meeting in the primary school."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0