IT Returns File Description of Who to File.
ఐటీ రిటర్న్స్ ఫైల్ ఎవరు చేయాలో వివరణ.
- 2020-21 కోసం ఈనెల 31 డెడ్‌లైన్
- ఎంచుకునే ట్యాక్స్ సిస్టమ్ బట్టి మార్పు
- ఇవి గుర్తుంచుకోవాలి.
కొత్త ట్యాక్స్ సిస్టమ్ ఎంచుకుంటే హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్‌ఆర్‌ఏ), లీవ్ ట్రావెల్ అలవెన్స్ వంటి కామన్ ట్యాక్స్ మినహాయింపులను క్లయిమ్ చేసుకోవడానికి ఉండదు. అదేవిధంగా సెక్షన్ 80 సీ, 80డీ, 80టీటీఏ కింద డిడక్షన్లు కూడా అందుబాటులో ఉండవు. ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీమ్) అకౌంట్ కోసం ఎంప్లాయర్ చేసే కంట్రిబ్యూషన్‌పై మాత్రమే (సెక్షన్ 80సీసీడీ(2)) ట్యాక్స్ డిడక్షన్ అందుబాటులో ఉంటుంది.
ఫైనాన్షియల్ ఇయర్ 2020-21 కోసం ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేయడానికి ఈ నెల 31 డెడ్‌లైన్. ఇప్పటికే ఈ డెడ్‌లైన్‌ను చాలా సార్లు ప్రభుత్వం పొడిగించింది. ఈ సారి పొడిగించే అవకాశాలు తక్కువ. అందుకే ఐటీఆర్‌ను డెడ్‌లైన్‌లోపు కచ్చితంగా ఫైల్ చేయాలి. లేకపోతే పెనాల్టీ పడుతుంది. కానీ, ఎవరు ఐటీఆర్‌ను ఫైల్ చేయాలి? సాధారణంగా ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 2.5 లక్షలు కంటే ఎక్కువ ఇన్‌కమ్ సంపాదిస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలి.
ఎవరు చేయాలో వివరణ.
ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో వ్యక్తి సంపాదించిన ఇన్‌కమ్ (గ్రాస్) బేసిక్ మినహాయింపును మించితే, ఆ వ్యక్తి ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపు వ్యక్తి ఎంచుకున్న ట్యాక్స్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇండివిడ్యువల్ కొత్త ట్యాక్స్ సిస్టమ్‌ను ఎంచుకుంటే ఆమె లేదా అతని బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపు రూ. 2.5 లక్షలు. పాత ట్యాక్స్ సిస్టమ్‌లో అయితే బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపు ఏజ్‌ను బట్టి మారుతుంది. కానీ, కొత్త ట్యాక్స్ సిస్టమ్‌లో ఏజ్‌ను బట్టి మినహాయింపు ఇవ్వడాన్ని తొలగించారు. కొత్త సిస్టమ్‌లో సీనియర్ సిటిజన్లకు అదనంగా బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపును ఇవ్వడం లేదు. కానీ, పాత ట్యాక్స్ సిస్టమ్‌తో పోలిస్తే కొత్త సిస్టమ్‌లో ట్యాక్స్ రేట్లను తగ్గించారు. మరోవైపు ట్యాక్స్ డిడక్షన్లను తొలగించారు. అంటే ఒక వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం కింద రూ. 20 వేలు కడితే, ఆ వాల్యూని ఇన్‌కమ్ నుంచి కట్ చేసుకొని మిగిలిన అమౌంట్‌పై ట్యాక్స్ లెక్కించొచ్చు. కొత్త సిస్టమ్‌లో ఈ ఫెసిలిటీ లేదు.
పాత ట్యాక్స్ సిస్టమ్‌లో ఎవరంటే!
పాత ట్యాక్స్ సిస్టమ్‌ను ఎంచుకుంటామనుకుంటే బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపు ఏజ్‌ను బట్టి మారుతుంది. అంటే 60 ఏళ్లలోపు ఏజ్ ఉన్నవాళ్లయితే, ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో సంపాదించిన ఆదాయం రూ. 2.5 లక్షలు దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే. అదే 60-80 ఏళ్లు మధ్య ఉన్న వారి (సీనియర్ సిటిజన్స్) ఇన్‌కమ్ రూ. 3 లక్షల పైన ఉంటే ఐటీఆర్ కట్టాలి. 80 ఏళ్ల పైన ఉంటే (సూపర్ సిటిజన్స్) రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం వస్తే ఐటీఆర్ ఫైల్ చేయాలి.
ఐటీఆర్ ఫైల్ చేయడానికి.
కొన్ని సార్లు వ్యక్తి ఆదాయం బేసిక్ ఇన్‌కమ్ మినహాయింపును దాటకపోయినా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం, కింద పేర్కొన్న కేటగిరీలు ఐటీఆర్ ఫైల్ చేయాలి.
- 1) ఫారిన్ కంట్రీకి ట్రావెల్ చేయడానికి తన కోసమైన లేదా ఇతరుల కోసమైన ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినవాళ్లు.
- 2) ఒక అకౌంట్ లేదా వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ. కోటి కంటే ఎక్కువ డిపాజిట్ చేసినవారు.
- 3) ఫైనాన్షియల్ ఇయర్‌లో ఒకే ఎలక్ట్రిసిటీ బిల్లులో రూ. లక్ష చెల్లించిన వారు.
- 4) విదేశాల నుంచి ఆదాయం వస్తున్న వారు. విదేశాల్లో ఆస్తులు ఉన్నవారు.
- 5) క్యాపిటల్ గెయిన్స్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని కొన్ని మినహాయింపులను క్లయిమ్ చేసుకోకముందే, వ్యక్తి గ్రాస్ ఇన్‌కమ్ బేసిక్ మినహాయింపును దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాలి.
- 6) ఫైనాన్షియల్ ఇయర్‌లో వ్యక్తి యొక్క ఆదాయం బేసిక్ మినహాయింపును దాటకపోయినా, ట్యాక్స్ కట్ అయితే రీఫండ్ కోసం ఐటీఆర్‌ను ఫైల్ చేయాలని ఎక్స్పర్టులు చెబుతున్నారు.
0 Response to "IT Returns File Description of Who to File."
Post a Comment