Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New rules from december 2021 details

డిసెంబర్  నుంచి మారనున్న కొత్త నిబంధనలు ఇవే, ఇవాళ తప్పనిసరిగా చేయాల్సిన పనులివే.

New rules from december 2021 details

డిసెంబర్ నుండి దైనందిక జీవితంలో కొత్త మార్పులు రానున్నాయి. రోజువారీ వ్యవహారాల్లోనే కాకుండా కీలకమైన అంశాల్లో కొత్త నిబంధనలు అమల్లో రానున్నాయి.

ఆ కొత్త నిబంధనలేంటనేది తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా రేపట్నించి అంటే డిసెంబర్ 1 నుంచి కీలకమైన నిబంధనలు(New Rules From December 1) అమల్లోకి రానున్నాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలెండర్, ఈపీఎఫ్ ఎక్కౌంట్(EPF Account) ఆధార్ నెంబర్ లింకింగ్, ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ వంటి అంశాల్లో పలు మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులేంటనేది ఇప్పుడు పరిశీలిద్దాం. ఆ కొత్త నిబంధనల్ని పాటించకపోతే పలు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

ఇన్‌కంటాక్స్‌కు సంబంధించిన కీలకమైన ప్రకటన ఉంది. 2021-22 అసెస్‌మెంట్‌కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఆ తరువాత జరిమానాతో ఐటీఆర్ పైల్ చేయాల్సి ఉంటుంది. ఇక పెన్షనర్లు కూడా నవంబర్ 30లోగా అంటే ఇవాళ్టిలోగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే డిసెంబర్ నెల నుంచి పెన్షన్ రాదు. రిటైర్ అయిన ఉద్యోగులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా పెన్షన్ పొందాలంటే నవంబర్ 1 నుంచి 30 తేదీల మధ్య బ్యాంకులకు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి.

మరో ముఖ్యమైన ప్రకటన ఈపీఎఫ్ (EPF)ఖాతాదారుల కోసం. ఈ నెలాఖరులోగా అంటే ఇవాళ్టిలోగా మీ యూఏఎన్ నెంబర్‌ను ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేయాలి. గతంలో సెప్టెంబర్ 1 గడువు తేదీగా ఉంది. ఆ గడువును నవంబర్ 30 వరకూ పొడిగించారు. ఇవాళ్టిలోగా మీ పీఎఫ్ ఖాతాను ఆధార్ నెంబర్‌తో (EPF-Aadhaar Card Linking)లింక్ చేయకపోతే ఈపీఎఫ్ జమ కాదు. ఇక గ్యాస్ ధరల్లో మార్పులు రానున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా 1, 15 తేదీలకు గ్యాస్ సిలెండర్ ధరల్ని సవరిస్తాయి. డిసెంబర్ 1వ తేదీన గ్యాస్ సిలెండర్ ధరలు మారనున్నాయి. నవంబర్ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలెండర్ 266 రూపాయలు కాకపోతే..డొమెస్టిక్ ధరల్లో ఏ విదమైన మార్పు రాలేదు. డిసెంబర్ 1న గ్యాస్ ధరలు(Domestic Gas Price) మారనున్నాయో లేదో చూడాలి.

ఇక బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కొత్త నిబంధనలు(New Banking Rules) అమల్లో రానున్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు రేపట్నించి ఈఎంఐ విధానంలో జరిపే కొనుగోళ్లకు అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ కొనుగోళ్లపై 99 రూపాయలకు అదనంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక 14 ఏళ్ల తరవాత పెరగనున్న అగ్గిపెట్టె ధరలు కూడా రేపట్నించే వర్తిస్తాయి. రేపటి నుంచి అగ్గిపెట్టె ధరలు 2 రూపాయలకే విక్రయించనున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అక్కౌంట్ వడ్డీ రేట్లు కూడా తగ్గుతున్నాయి ప్రస్తుతం ఉన్న వార్షిక వడ్డీ 2.90 శాతం నుంచి 2.80 శాతానికి తగ్గనుంది. మరోవైపు రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు ( Jio Preplan Plans Price) కూడా పెరుగుతున్నాయి. జియోకు సంబంధించిన అన్ని ప్లాన్స్ 20 శాతం వరకూ పెరుగుతాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New rules from december 2021 details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0