ONGC Recruitment 2021
ONGC Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. ONGC లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ . అప్లై చేసే విధానం.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.
పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటిచింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై (Job Application) చేసుకునేందుకు జనవరి 4ను అఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 2 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
పోస్టు | ఖాళీలు |
హెచ్ ఆర్ ఎగ్జిక్యూటీవ్ (HR Executive) | 15 |
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (Public Relations Officer) | 6 |
మొత్తం | 21 |
విద్యార్హతల వివరాలు.
HR Executive: పర్సనల్ మేనేజ్మెంట్/HRD/HRM తదితర విభాగాల్లో 60 శాతం మార్కులతో MBA చేసిన వారు ఈ విభాగంలో ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు.
Public Relations Officer: పబ్లిక్ రిలేషన్స్/జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్ లో 60 శాతం మార్కులతో పీజీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఈ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు తప్పనిసరిగా UGC NET-June 2020 అర్హత సాధించి ఉండాలి.
అప్లై చేయు విధానం
- Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://www.ongcindia.com/wps/wcm/connect/en/home ను ఓపెన్ చేయాలి.
- Step 2: అనంతరం Career విభాగంలో Recruitment Notice ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- తర్వాత మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ Recruitment of HR Executive and Public Relations Officer through UGC NET 2020 Score ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- Step 3: అనంతరం Click here for Registration Link ఆప్షన్ పై క్లిక్ చేయండి
- Step 4: తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ సూచించిన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ ను పూర్తి చేయాలి.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో రూ. 300ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. EWS, OBC కేటగిరీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
0 Response to "ONGC Recruitment 2021"
Post a Comment