Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Stalin's decision effect on CM Jagan: No four .. Telchude: Good news for employees tomorrow!

సీఎం జగన్ పై స్టాలిన్ నిర్ణయం ఎఫెక్ట్ : నాన్చుడు లేదు.. తేల్చుడే : ఎంప్లాయిస్ కు రేపే గుడ్ న్యూస్.!

Stalin's decision effect on CM Jagan: No four .. Telchude: Good news for employees tomorrow!

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ముఖ్యమంత్రి జన్మదినం నాడే తమకు పీఆర్సీ పైన ప్రకటన చేసి గిఫ్ఠ్ ఇస్తారంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆశించారు. కానీ, ప్రకటన రాలేదు. ఇప్పటికీ ఇంకా..చర్చలు పూర్తి కాలేదు. తిరుపతిలో సీఎం వరద బాధితులను పరామర్శించే సమయంలో.. వారం పది రోజుల్లో పీఆర్సీ పైన తుది నిర్ణయం వెలువడుతుందని ప్రకటించారు. కానీ, ఇప్పటికే అనేక సార్లు అధికారులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. సీఎస్ కమిటీ పీఆర్సీ సిఫార్సుల పైన వారి నివేదికను సమర్పించింది. అయితే, అసలు పీఆర్సీ నివేదిక - సిఫార్సుల విషయం పక్కకు వెళ్లింది. ఇప్పుడు అధికారులు ఇచ్చిన కమిటీ నివేదిక ఆధారంగా ఇప్పుడు ఫిట్ మెంట్ పైన చర్చలు సాగుతున్నాయి. మంగళవారం ఆర్దిక శాఖ అధికారులతో సీఎం జగన్ పీఆర్సీ పైన సమీక్ష నిర్వహించారు. ఎంత మేర ప్రకటిస్తే ఏ మేర భారం పడుతుందనే అంశాలను పరిశీలించారు. ఇప్పటికే డీఏలు సైతం పెండింగ్ లో ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు 45 శాతం డిమాండ్ చేస్తున్నా...ఆ స్థాయిలో ప్రభుత్వం ముందుకొచ్చే పరిస్థి లేదు. ఐఆర్ కంటే మాత్రం ఎక్కువగా ఇస్తామంటూ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.

ఫిట్ మెంట్ పైనే పీఠముడి

దీంతో.. 27 శాతం కంటే పైగానే ఫిట్ మెంట్ ఖాయం. 30 శాతంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగ సంఘాలు మాత్రం మరింత పట్టుబట్టే అవకాశం ఉండటంతొ..సీఎం తన స్థాయిలో ఉదారంగా నిర్ణయం ప్రకటించేందుకు మరి కొంత కలిపి ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోందని చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే పీఆర్సీ 30 శాతం అమలు చేస్తున్నారు. ఇక, తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ న్యూ ఇయర్ గిఫ్టుగా ఉద్యోగులకు డీఏను 14 శాతం పెంచుతూ ప్రకటన చేసారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 17 శాతంగా ఉన్న డీఏను 31 శాతంగా పెంచారు.

న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రకటించాలంటూ

జనవరి ఒకటో తేదీ నుంచి ఈ పెంపును వర్తింప చేశారు. ఈ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8,724 కోట్ల అదనపు భారం పడిందన్నారు. అలాగే సీ, డీ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా రూ. 3,000 ప్రకటించారు. పెన్షనర్లకు రూ. 500 ఇవ్వనున్నారు. ఇక, ప్రత్యేక కేటగిరిలో పనిచేస్తున్న గ్రామ అధికారులకు రూ. 1000 రూ, పదవీ విరమణ పొందిన వారికి రూ. 300 ఇవ్వనున్నారు. ఈ కానుకతో రూ. 169 కోట్ల వరకు భారం పడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఏపీ లో ప్రస్తుతం ఉన్న ఆర్దిక పరిస్థితుల కారణంగా సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు.

సీఎం జగన్ తుది ప్రకటనకు రంగం సిద్దం

అయితే, ఉద్యోగులతో మరోసారి సీఎస్ చర్చలు నిర్వహిస్తున్నారు. అందులో వారిని మరోసారి ఫిట్ మెంట్ అంశంలో వారి డిమాండ్ ను తగ్గించేలా ప్రయత్నం చేయనున్నారు. చివరగా .. రేపు (గురువారం) సీఎం వద్ద ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ రోజు సమావేశాలకు అనుగుణంగా సీఎంతో భేటీ పైన నిర్ణయం రానుంది. మరింతగా ఈ అంశాన్ని నాన్చకుండా... తేల్చేసే విధంగా సీఎం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యమంత్రి జగన్ తో జరిగే సమావేశంలో న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఫిట్ మెంట్ ను ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. 


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Stalin's decision effect on CM Jagan: No four .. Telchude: Good news for employees tomorrow!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0