Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Student Loans for Abroad

 Education Loan: ఎడ్యుకేషన్ లోన్లు ఎలా అప్లై చేయాలి? ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ? మొత్తం లిస్ట్.

Student Loans for Abroad

Student Loans for Abroad | ఎడ్యుకేషన్​ లోన్లకు (Education Loan) ఆన్​లైన్ లేదా ఆఫ్​లైన్​ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు (Online Application for Loan) చేసుకోవడానికి ముందుగా మీ దరఖాస్తు ఫారమ్​ నింపి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జోడించి సబ్​మిట్​ చేయాలి.

దేశ విదేశాల్లో ఉన్నత విధ్యనభ్యసించాలనే విద్యార్థులు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రతిభ ఉన్నా సరే ఆర్థిక స్థోమత లేక ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతుంటారు. అటువంటి వారికి చేయూతనిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. వారిని ఉన్నత విద్య వైపు వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నాయి. చాలా తక్కువ వడ్డీకే విద్యా రుణాలను (Education Loans) ప్రధాన బ్యాంకులు అందజేస్తున్నాయి. భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు కేవలం 6.75% వడ్డీ రేటు నుంచే విద్యారుణాలను (Interest Rate on Education Loans) ఆఫర్​ చేస్తున్నాయి. కేవలం ఫుల్​ టైమ్​ కోర్సులకే కాదు, పార్ట్‌టైమ్ కోర్సులకు (Education Loans for Part Time Cources) సైతం ఈ లోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2021లో ప్రధాన బ్యాంకులు ఎంత వడ్డీ రేటుతో ఎడ్యుకేషన్ లోన్లు అందిస్తున్నాయో పోల్చి చూద్దాం.

1. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank)

ఈ బ్యాంకు గరిష్ట రుణంపై ఎటువంటి పరిమితి లేదు. గరిష్టంగా 15 సంవత్సరాల వ్యవధి రుణాలు అందజేస్తుంది. ఎటువంటి పూచీకత్తు లేకుండానే రూ.7.5 లక్షల వరకు రుణం మంజూరు చేస్తుంది. భారతదేశంతో పాటు విదేశీ విద్యకు సైతం ఈ రుణాలు తీసుకోవచ్చు. కోర్సు పూర్తయిన 6 నెలల నుంచి లోన్​ రీపేమెంట్​​ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

2. స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (State Bank of India)

దేశంలోనే అతి పెద్ద రుణదాత అయిన ఎస్‌బీఐ  తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్​ లోన్​ అందజేస్తుంది. మహిళా విద్యార్థులకు రాయితీపై రూ.20 లక్షల వరకు లోన్​ ఆఫర్​ చేస్తుంది. రూ. 7.5 లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాన్ని ఆఫర్​ చేస్తుంది. కోర్సు పూర్తయిన 12 నెలల తర్వాత లోన్​ రీపేమెంట్​ ప్రక్రియ మొదలవుతుంది.

3. యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)

ఈ బ్యాంకు గరిష్టంగా రూ. 1 కోటి వరకు ఎడ్యుకేషన్​ లోన్​ అందజేస్తుంది. 15 సంవత్సరాల గరిష్ట రుణ వ్యవధిని అభ్యర్థులు ఉపయోగించుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ ఎటువంటి పూచీకత్తు లేకుండానే రూ.4 లక్షల వరకు రుణం మంజూరు చేస్తుంది. భారతదేశంతో పాటు విదేశీ విద్యకు సైతం ఈ రుణాలు తీసుకోవచ్చు. ఈ బ్యాంకు కేవలం 15 రోజుల్లో రుణాన్ని బ్యాంక్​ అకౌంట్​లో జమ చేయడం మరో విశేషం. కోర్సు పూర్తయిన 6 నెలల నుంచి లోన్ రీపేమెంట్​ మొదలవుతుంది.

4. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)

ఈ బ్యాంకు గరిష్టంగా రూ. 80 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ అందజేస్తుంది. గరిష్టంగా 10 నుంచి 15 సంవత్సరాల వ్యవధిపై రుణాలు ఇస్తుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండానే రూ.4 లక్షల వరకు రుణం మంజూరు చేస్తుంది. కేవలం ఉన్నత విద్యకే కాకుండా నర్సరీ నుంచి పీజీ వరకు రుణాలు ఆఫర్​ చేస్తుంది. మహిళలకు రాయితీపై రుణాలు అందజేస్తుంది.

5. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ (HDFC Bank)

భారత్​లో ఉన్నత విద్య కోసం హెచ్​డీఎఫ్​సీ​ బ్యాంక్ గరిష్టంగా రూ.20 లక్షలు, విదేశాల్లో అయితే రూ.35 లక్షల వరకు రుణాలు అందజేస్తుంది. ఎటువంటి పూచీకత్తు లేకుండానే ఈ లోన్​ను​ ఆఫర్​ చేస్తుండటం విశేషం. 15 సంవత్సరాల వ్యవధిపై ఈ రుణాలను అందజేస్తుంది.

6. టాటా క్యాపిటల్ ఎడ్యుకేషన్ లోన్ (Tata Capital Education Loan)

టాటా క్యాపిటల్ ఫైనాన్స్​ సంస్థ మెరిట్​ విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్​ ఆఫర్​ చేస్తోంది. ఈ సంస్థ గరిష్టంగా రూ.30 లక్షల వరకు 6 సంవత్సరాల వ్యవధితో రుణాన్ని మంజూరు చేస్తుంది. ఎటువంటి పూచీకత్తు లేకుండా రూ.4 లక్షల వరకు రుణం అందజేస్తుంది. కనీస డాక్యుమెంటేషన్​తో తక్కువ సమయంలోనే లోన్​కు ఆమోదం లభిస్తుంది. యూజీ, పీజీ, డాక్టోరల్ కోర్సులు, పీహెచ్​డీ, 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి కలిగిన సర్టిఫికేట్ కోర్సులకు రుణాలు మంజూరు చేస్తుంది.

ఎడ్యుకేషన్ లోన్ కింద కవర్ అయ్యే ఖర్చులు

ఎంత మొత్తంలో రుణం మంజూరు చేయాలనేది మీరు చేయబోయే కోర్సు ఫీజుపై ఆధారపడి ఉంటుంది. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు, బీమా ప్రీమియం, పుస్తకాలకు అయ్యే ఖర్చు, ఎగ్జామ్​/ లైబ్రరీ ఫీజు, కోర్సు పూర్తి చేయడానికి అవసరమైన కంప్యూటర్/ల్యాప్‌టాప్​కు అయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. అంతేకాదు, కాషన్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్/రిఫండబుల్ డిపాజిట్ ఇన్‌స్టిట్యూషన్ బిల్లులు, స్టడీ టూర్‌లు/థీసిస్/ప్రాజెక్ట్ వర్క్ వంటివి పూర్తి చేయడానికి అవసరమయ్యే ఖర్చులను పరిగణనలోకి తీసుకొని ఈ ఎడ్యుకేషన్​ లోన్​ను బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి.​

ఎడ్యుకేషన్​ లోన్ ఫీచర్లు & ప్రయోజనాలు (Education Loan features)

  • 1. వివిధ బ్యాంకులు గరిష్టంగా రూ.1 కోటి వరకు విద్యా రుణం మంజూరు చేసే అవకాశం ఉంది.
  • 2. లోన్ రీపేమెంట్ వ్యవధి 15 సంవత్సరాల వరకు ఉంటుంది.
  • 3. భారతదేశంతో పాటు విదేశాల్లో చదువులకు సైతం రుణాలు అందుబాటులో ఉన్నాయి.
  • 4. వీసా కోసం దరఖాస్తు చేయడానికి ముందే బ్యాంకులు అభ్యర్థుల అకౌంట్​కు లోన్ మొత్తాన్ని జమ చేస్తాయి.
  • 5. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సేకరించడానికి డోర్-స్టెప్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
  • 6. బ్యాంకు ఉద్యోగుల పిల్లలు రాయితీపై ఎడ్యుకేషన్​ లోన్​ పొందవచ్చు.
  • 7. కొన్ని బ్యాంకులు మహిళా విద్యార్థులకు రాయితీపై ఎడ్యుకేషన్​ లోన్లు మంజూరు చేస్తున్నాయి.
  • 8. కోర్సు పూర్తయిన ఏడాది వరకు మారటోరియం అవకాశం ఉంటుంది. అంటే ఈ కాలంలో మీరు వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదు.
  • 9. చెల్లించిన వడ్డీపై 8 సంవత్సరాల వరకు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.

ఎడ్యుకేషన్ లోన్ ఎలా అప్లై చేయాలి? (How to apply Education Loan)

ఎడ్యుకేషన్​ లోన్లకు ఆన్​లైన్ లేదా ఆఫ్​లైన్​ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా మీ దరఖాస్తు ఫారమ్​ నింపి, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జోడించి సబ్​మిట్​ చేయాలి. ఆఫ్​లైన్​ విధానంలో అయితే మీ అన్ని డాక్యుమెంట్లతో మీ సమీపంలోని బ్రాంచ్‌ని సందర్శించండి. మీ డాక్యుమెంట్లను పరిశీలించి అర్హత ఉంటే రుణం మంజూరు చేస్తారు.

దరఖాస్తుదారులు విద్యా సంస్థ నుంచి తీసుకున్న అడ్మిషన్ లెటర్, మార్క్‌షీట్‌లు, ఏజ్​ ప్రూఫ్​, ఐడీ ప్రూఫ్, అడ్రస్​ ప్రూఫ్​​, సిగ్నేచర్​, ష్యూరిటీ పెట్టే నామినీ పే స్లిప్పులు, ఇటీవలి బ్యాంక్ అకౌంట్​ స్టేట్​మెంట్లు, విదేశాల్లో విద్యాభ్యాసానికి పొందిన వీసా కాపీ.. వంటి డాక్యుమెంట్లను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Student Loans for Abroad"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0