Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Employees Strike

 AP Employees Strike : ఫిబ్రవరి 7 నుంచి సమ్మె .. ఉద్యమ కార్యచరణ ఇదే .

AP Employees Strike


AP Employees Strike: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సమ్మె సైరన్ మోగింది.. ఇప్పటికే దీనిపై ఉద్యోగ సంఘాలు (Employees Union) నిర్ణయం తీసుకున్నాయి.

ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ.. 7 నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది.

విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు. పీఆర్సీ పోరాట కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 24న సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానించాయి. ఇవాళ సీఎస్‌ సమీర్‌శర్మను కలిసి పాత జీతాలే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరనున్నాయి. అలాగే ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 25న ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 26న అన్ని తాలూకా కేంద్రాల్లో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాలకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్నారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యాచరణ ప్రకటించారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం అసోసియేషన్‌ హాలులో మరోసారి ఆయా సంఘాలన్నీ భేటీ కానున్నాయి. అనంతరం ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై ఐకాస నేతలు సంతకాలు చేయనున్నారు.

మరోవైపు ట్రెజరీ డైరెక్టర్‌కు పే అండ్‌ అకౌంట్స్‌ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. వేతన బిల్లులు ప్రాసెస్ చేయబోమని తెలిపింది. బిల్లులు ప్రాసెస్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని.. తాము మాత్రం పీఆర్సీ ఉద్యమంలో పాల్గొంటున్నామని స్పష్టం చేసింది. తమపై ఒత్తిడి తేవొద్దని పేర్కొంది.

ఇకపై ప్రతి ఆందోళనలోనూ అన్ని సంఘాలు ఐక్యంగా పాల్గొంటాయని. ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన జీవోలను వెనక్కు తీసుకునేంత వరకు తాము వెనుక అడుగు వేయమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.. సీఎస్ కు నోటీసులు ఇవ్వడంతో పాటు.. తమకు పాత జీతాలే ఇవ్వాలని కోరానున్నారు..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Employees Strike "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0