AP tenth class exams in March itself. The syllabus should be completed by Sankranthi.
మార్చిలోనే ఏపీ పదో తరగతి పరీక్షలు . సంక్రాంతి నాటికి సిలబస్ పూర్తి చేయాలి .
దేశంలో థర్డ్ వేవ్ వేగంగా దూసుకొస్తోంది. అమెరికాలో టీనేజర్స్ మీద థర్డ్ వేవ్ అధిక ప్రభావం చూపించడంతో.. మన దేశంలో కూడా 15 నుంచి 18 సంవత్సరాలలోపు వాళ్లందరికీ కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టింది.
రానున్న నెలల్లో కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో.. పదో తరగతి పరీక్షలపై ఏపీ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.
పదో తరగతి పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. సంక్రాంతి నాటికి సిలబస్ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే 15 నుంచి 18 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రతి స్కూల్‌లో 95 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు.
విద్యా సంవత్సరం ప్రారంభంలో అమ్మ ఒడి మూడో విడత ఇస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నిబంధనలు పాటించని బీఈడీ, డీఈడీ, 375 కాలేజీలు మూతపడ్డాయని మంత్రి చెప్పారు. ప్రైవేట్ యూనివర్సిటీలో చట్టసవరణ ద్వారా 35 శాతం ఫ్రీ సీట్లు ఇచ్చామని.. అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లన్నారు. ఏ విద్యార్థి డబ్బులు లేక విద్యకు దూరం కాకూడదని.. అమ్మ ఒడి ఇచ్చి విద్యార్థులకు యూనిఫాం, బుక్స్‌తో పాటు మధ్యాహ్న పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు.
Right sir
ReplyDeleteWho said... There is no syllabus completed.No rivision started.how it become right,say sir
Delete