Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

coffee: This is the way to drink coffee. It is better to follow these tips for our health.

 coffee : కాఫీ తాగే పద్దతి ఇది.మన ఆరోగ్యం కోసం ఈ చిట్కాలు పాటిస్తే మంచిది.

coffee: This is the way to drink coffee. It is better to follow these tips for our health.

ప్రపంచవ్యాప్తంగా ఉదయం లేవగానే కాఫీని తాగేవారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఒక్క రోజు కాఫీ తాగకపోయినా ఆ రోజంతా ఏదో కోల్పోయిన వారిలా కనిపిస్తారు చాలామంది.

వేడి కాఫీ, కోల్డ్ కాఫీ ఏదైనా సరే కాఫీనే, తాగేయాల్సిందే. బ్లాక్ కాఫీని తాగేవాళ్లు కూడా అధికమే. రంగులో ఎన్ని తేడాలున్నా అన్నింట్లో ఉండేది మాత్రం కెఫీనే. అయితే కాఫీ మితంగా తాగితే ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో, అధికంగా తాగితే అన్ని నష్టాలున్నాయి. కాఫీని తాగే పద్ధతుల్లో కొంచెం మార్పులు చేస్తే చాలు అది మీకు ఆరోగ్యాన్ని అందించే పానీయంగా మారుతుంది. అందుకు ఈ చిట్కాలు పాటించాల్సిందే.

మగ్‌తో మానండి

కాఫీని స్టైల్‌గా మగ్‌లో తాగుతారు చాలా మంది. మగ్‌లు చిన్న పరిమాణంలో ఉండవు. దాన్నిండా తాగితే కెఫీన్ అధికస్థాయిలో ఒంట్లో చేరుతుంది. కాబట్టి ముందుగా మీరు చేయాల్సింది మగ్‌లు వాడడం మానేయండి. చక్కటి టీ కప్ తీసుకుని, ఆ పరిమాణంలోనే తాగండి. మగ్‌లు మీకు తెలియకుండానే అతిగా కాఫీ తాగేలా చేస్తాయి.

సాయంత్రం వద్దు

సాయంత్రం అయిదు గంటలలోపే కాఫీని తాగాలి. ఆ సమయం దాటాకా తాగకపోతేనే ఆరోగ్యం. అయిదు దాటాక తాగేవారిలో నిద్రలేమి సమస్యలు కలుగుతాయి. మీ నిద్రాసైకిల్‌ను సాయంత్రం తాగే కాఫీ డిస్ట్రబ్ చేస్తుంది. కాఫీ ఉదయం తాగితే ఉత్సాహాన్నిస్తుంది. రాత్రి తాగితే సమస్యలను తెచ్చిపెడుతుంది.

పంచదార బంద్

పంచదారను తెల్లటి విషం అనే చెప్పచ్చు. కాఫీ ఎంత తియ్యగా ఉంటే అది అంతగా మీకు హాని చేస్తుంంది. అధికమొత్తంలో చక్కెరను కలపడం మానుకోవాలి. చక్కెర లేని కాఫీ తాగితే ఇంకా మంచిది.

తాగండి కానీ మునిగిపోకండి

కాఫీని ప్రతి రోజూ తాగండి. కానీ అందులో మునిగి తేలకండి. ఒక చిన్న గ్లాసు కాఫీ చాలు మీ మూడ్ మారి, ఉత్సాహంగా మారడానికి. అంతేతప్ప ఎంత ఎక్కువ కాఫీ తాగితే అంత లాభం అనుకోవద్దు. ఎంత మితంగా తీసుకుంటే కాఫీ అంత మేలు చేస్తుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "coffee: This is the way to drink coffee. It is better to follow these tips for our health."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0