Let’s get out of the corona this year
కరోనా నుంచి ఈ ఏడాది బయటపడతాం
వాషింగ్టన్: కరోనా కచ్చితంగా అంతమవుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు.
అయితే దీనికి ప్రభుత్వాలు, ఉత్పత్తిదారులు ముఖ్యంగా 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలన్నారు. ఒకటి.. వ్యాక్సినేషన్ కొరత వల్ల రిస్క్ ఎదుర్కొంటున్న దేశాలకు టీకాల సరఫరా పెంచడం, రెండు.. వ్యాక్సిన్లకు అవసరమైన వనరులను ఏర్పరుచుకోడమని చెప్పారు.
వీటిని గుర్తుంచుకుంటే ఈ ఏడాది సెకండాఫ్‌లో కరోనా అంతమవుతుందని అన్నారు. అంతా సేఫ్గా మారే వరకు మనం కూడా సురక్షితంగా ఉండలేమనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. కరోనా వచ్చి మూడేళ్లు అవుతోందని, అయితే మరో ఏడాదిలో ఈ మహమ్మారి నుంచి బయటపడతామని నమ్మకం ఉందని చెప్పారు. అందరం కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని వివరించారు. ఈ ఏడాది సెకండ్ క్వార్టర్ నాటికి ప్రపంచవ్యాప్తంగా 70% మందికి వ్యాక్సిన్ వేయాలన్న లక్ష్యం నెరవేరాలంటే, అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సి అవసరం ఉందని చెప్పారు.
0 Response to "Let’s get out of the corona this year"
Post a Comment