Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PRC litigation once again for CJ decision

పీఆర్సీ వ్యాజ్యం మరోసారి సీజే నిర్ణయానికి

PRC litigation once again for CJ decision
  • సింగిల్ జడ్జికి విచారణ బాధ్యతలు
  • నిబంధనలు అంగీకరించవని ఏజీ వివరణ
  • ధర్మాసనమే విచారించాలని వాదన
  • ఏకీభవించిన న్యాయమూర్తి
  • మరోసారి సీజే ముందుకు ఫైల్

ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రకటనపై హైకోర్టులో దాఖలైన వ్యాజ్యం మలుపులు తిరుగుతోంది. విచారణ బాధ్యతలు ఎవరికి అప్పగించాల నేది ఇంకా తేలలేదు. గత కొద్దిరోజుల క్రితం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అహ్సదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ శ్రీ భానుమతిల ధర్మాసనం విచారణ జరిపి రోస్టర్ ప్రకారం తమ పరిధిలోకి రాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ ఆ ఫైల్ను సీజే ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీంతో ఈ పిటిషన్ విచారణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయమై సీజే పాలనా పరమైన నిర్ణయం తీసుకుని మరో న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తికి విచారణ బాధ్యతలు బదలాయించారు. ప్రభుత్వ వేతన సవరణ జీవోను సవాల్ చేస్తూ ఏపీ గజటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. ఎట్టకేలకు దీనిపై శుక్రవారం జస్టిస్ సత్యనారాయణమూర్తి విచారణ ప్రారంభించారు. ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరాం జోక్యం చేసుకుంటూ రాజ్యాంగంలోని 309 అధికరణ కింద ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను పిటిషనర్ సవాల్ చేశారని హైకోర్టు రిట్ రూల్స్ ప్రకారం అలాంటి చట్ట నిబంధనలను సవాల్ చేస్తూదాఖలైన పిటిషన్ ను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనమే విచారించాల్సి ఉంటుందని వివరించారు. ఈ అధికరణ ఉద్యోగులకు సంబంధించిన నిబంధనలపై దాఖలయ్యే వ్యాజ్యాలు మొదటి కోర్టు ముందే విచారణకు వస్తాయ న్నారు. ఈ సందర్భంగా హైకోర్టు రిట్ రూల్స్ 14 (ఏ)(6)ను ఏజీ చదివి వినిపించారు. ఈ వాదనలపై స్పందించాల్సిందిగా న్యాయమూర్తి పిటిషనర్ తరుపు న్యాయ వాదిని కోరారు. పిటిషనర్ తరుపు న్యాయవాద్ పదిరి రవి) తేజ వాదనలు వినిపిస్తూ ఇది ఓ ఉద్యోగి సొంతగా వేసిన సర్వీస్ పిటిషన్ మాత్రమే అని కోర్టు దృష్టికి తెచ్చారు. వేతన సవరణ వల్ల తనకు అన్యాయం జరిగిందంటూ వ్యక్తిగతంగా ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. పిటిషనర్ అభ్యర్ధన పై ఆరా తీసిన న్యాయమూర్తి ఈ వ్యాజ్యం ధర్మాసనం. ముందుకు వెళ్లాల్సి ఉంటుందని అభిప్రాయపడుతూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యం ఎవరికి బదలాయించాలనే దానిపై తగిన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఫైళ్లను సీజే ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. కాగా గత విచారణ సందర్భంగా జస్టిస్ అహ్సదుద్దీన్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ఉద్యోగుల జీతం ఏ రకంగా తగ్గుతుందో వివరించాలని పిటిషనర్ను ప్రశ్నించింది. ఈ వివరాలతో పిటిషనర్ మరో అనుబంధ పిటిషన్ ను దాఖలు చేశారు. 
జీతం తగ్గుతుంది
2015 పీఆర్సీ ప్రకారం తనకు ఎంత జీతం అందుతోంది? 2022 ప్రకారం ఎంత వస్తుందో గణాంకాల తో సహా వివరించారు. 2015 డీఏతో కలిపి వచ్చే జీతాన్ని 2022 డీఏతో కలిపి వచ్చే మొత్తాన్ని కూడా బేరీజువేసి చూపి స్తూ కొత్త పీఆర్సీ కారణంగా తన జీతంలో రూ. 6072 తగు తుందన్నారు. ఈ అనుబంధ పిటిషన్తో పాటు రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సమర్పించిన రహస్య నివేదికను బహిర్గతం చేయాలంటూ 2011లో అప్పటి న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇచ్చిన తీర్పును జతపరిచారు. దీంతో పాటు కోవిడ్ కారణంగా గతంలో 50 శాతం ప్రభుత్వం జీతాలు చెల్లింపును వాయిదా వేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను తప్పుపడుతూ 12 శాతం వడ్డీతో సహా జీతాలు, పెన్షన్లు చెల్లించాల్సిందిగా గతంలో జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇచ్చిన తీర్పును జతపరిచారు. న్యాయమూర్తి జస్టిస్ సత్యనారా యణ మూర్తి స్పందిస్తూ మీ వ్యాజ్యంలో అభ్యర్ధన ఏంటని ప్రశ్నించారు. పిటిషనర్ తరుపు న్యాయవాది అభ్యర్ధనను చదివి వినిపించారు. ముందుగా ఏజీ చేసిన వాదనలతో ఏకీభవిస్తూ ఈ వ్యాజ్యంపై తాను విచారణ జరపలేమని స్పష్టం చేశారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PRC litigation once again for CJ decision"

Post a Comment