Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Preparation of salaries as per new PRC: AP State Finance Ministry orders

 కొత్త PRC మేరకు జీతాల తయారీ : ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ ఉత్తర్వులు

Preparation of salaries as per new PRC: AP State Finance Ministry orders

కొత్త పీఆర్సీ ప్రకారం జీతాల చెల్లింపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పీఆర్సీ  ఆధారంగా బిల్లులు తయారు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.

 అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించేలా బిల్లులు తయారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కొత్త పీఆర్సీ జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ ఏడాది జనవరి జీతాలను కొత్త పీఆర్సీ ప్రకారంగా చెల్లించేలా బిల్లుల తయారీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ  బిల్లుల తయారీకి ఆదేశించింది. 2018 జూలై 1 నుండి 2021 డిసెంబర్ 31 వరకు సర్వీస్ గణించి  కొత్త సాఫ్ట్ వేర్ మాడ్యూల్ లో బిల్లులు అప్ లోడ్ చేయాలని సూచించింది. 

 ఈ నెల 25 లోపుగా ప్రక్రియ పూర్తి చేయాలని  అధికారులకు ఆదేశించింది. డీడీవోలకు కొత్త పే రోల్స్ కు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది ఆర్ధిక శాఖ. ఈ మేరకు ఏపీ రాష్ట్రఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. సమ్మె చేస్తామని కూడా ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుండి ఉద్యోగ సంఘాలు సమమె చేస్తామని హెచ్చరించాయి.ఈ నెల 24న  సీఎస్ కు ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని కూడా నిర్ణయం తీసుకొన్నాయి. ఉద్యోగ సంఘాలు సమావేశమై  ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఆందోళన కార్యక్రమాలను రూపొందించాయి. జిల్లాాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించనున్నారు. ఉద్యోగ సంఘాలకు  విపక్షాలు కూడా ఆందోళనను ప్రకటించే అవకాశం లేకపోలేదు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం  హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత HRAవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.తక్కువ  ఫిట్‌మెంట్ ఇచ్చినా పీఆర్సీ ఫిట్‌మెట్ కు అంగీకరించినా ప్రభుత్వం హెచ్ఆర్‌ఏ తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Preparation of salaries as per new PRC: AP State Finance Ministry orders"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0