Tea Side Effects
Tea Side Effects : మీ పిల్లలు టీ తాగుతున్నారా .. అయితే ప్రమాదమే .. ?
Tea Side Effects: చాలామంది ఉదయమే టీ తాగాకే రోజు ప్రారంభమవుతుంది. నిద్ర లేచిన వెంటనే టీ గురించి వెతకడం ప్రారంభిస్తారు. అంతలా అది మన జీవన విదానంలో కలిసిపోయింది.
టీలో ఉండే కెఫిన్ పిల్లల శరీరానికి చాలా హాని చేస్తుంది. వారికి ప్రతిరోజూ ఎక్కువ మొత్తంలో టీ ఇస్తే వారి శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది. బద్దకంగా తయారవుతారు. ఎసిడిటీని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టీలో అధిక మొత్తంలో కెఫిన్ ఉండటం వల్ల పిల్లలు అధిక మూత్రవిసర్జనతో సమస్యలను ఎదుర్కొంటారు. మొదటి సంవత్సరం పిల్లలకు టీ అస్సలు ఇవ్వకూడదని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. కొంతవయసు వచ్చిన తర్వాత కొద్దిగా టీ మాత్రమే ఇవ్వాలి. అయితే నిపుణులు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీ ఇవ్వకూడదని సిఫార్సు చేస్తారు.
టీ పిల్లలకు అస్పలు ఇవ్వకూడదు ఎందుకంటే ఇది వారి నిద్ర వ్యవస్థకు భంగం కలిగిస్తుంది. దీనివల్ల ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం, నిద్ర లేవడం, దినచర్యలో మార్పులు జరగడం ప్రారంభమవుతుంది. అంతే కాదు కెఫిన్ వల్ల పిల్లలు చాలా అలసిపోతారు. ఈ పరిస్థితిలో మీరు వారికి టీ ఇవ్వకుండా ఉంటేనే మంచిది. పిల్లలకు టీ నిరంతరం ఇవ్వడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తోంది. మీరు పిల్లలకు టీ ఇవ్వాలనుకుంటే హెర్బల్ టీ ఇవ్వవచ్చు. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది.
0 Response to "Tea Side Effects"
Post a Comment