Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

That is why we gain weight.

 మనం బరువు అందుకే పెరుగుతామట.

That is why we gain weight.

ప్రధానాంశాలు:

  • ప్రస్తుత జీవనవిధానంతో పెరిగే బరువు
  • బరువు తగ్గేందుకు కొన్ని పాటించాలంటున్న నిపుణులు

చిన్న వారి నుండి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరి పై ప్రభావం చూపే వ్యాధులలో ఊబకాయం ఒకటి. ప్రస్తుతం ప్రపంచంలో చాలా మందికి ఊబకాయం సమస్య ఒక పెద్ద సవాలుగా మారింది. ఊబకాయం అంటే అధిక బరువే కాదు ఊబకాయం వల్ల డయాబెటిస్, హృదయానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వాటి వల్ల దీర్ఘ కాలికంగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఊబకాయం రావడానికి చాలా కారణాలు వున్నాయి. అయితే ముఖ్యంగా సరైన జీవన శైలి లేకపోవడం వల్లనే అని అందరూ భావిస్తారు. కాబట్టి మంచి జీవన శైలి యొక్క పాత్ర ఎంతో కీలకమైనది అని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఒబేసిటీ  సమస్యతో బాధ పడుతూ ఉంటే మంచి జీవనశైలి తో పాటు యాంటీ ఒబేసిటీ మందులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరిలో మాత్రం ఈ వ్యాధి వారి జీన్స్ నుండి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మన జీన్స్ కొవ్వు నిల్వలను నియంత్రిస్తాయి. అయితే ఈరోజు మనం ఊబకాయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలని చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

ఒక మనిషి ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణ వ్యవస్థలో ఉండే కొన్నిరకాల యాసిడ్స్ తో కలిసి జీర్ణ ప్రక్రియ కొనసాగుతుంది. ఆహారం జీర్ణం అయిపోయిన తర్వాత అది గ్లూకోజ్ కింద మారి దాని ద్వారా మనిషి ఎనర్జీ పొందుతారు, అయితె ఈ ప్రక్రియ కూడా జీన్స్ పై ఆధారపడి ఉంటుంది. మొత్తం ఆహారం ఎనర్జీ కింద మారకుండా కొవ్వు కింద కూడా మారే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే జీన్స్ వల్ల అధిక ఆహారం కొవ్వుగా మారితే మరియు అది మనం గుర్తించగలిగితే కొన్ని మందులు ద్వారా డాక్టర్ సూచనల మేరకు మనం దీనిని నియంత్రించ వచ్చు. దీంతో పాటు రోజువారీ ఆహారం కూడా తక్కువ తీసుకుంటూ ఉండొచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో ఉండేటువంటి వందల కొద్దీ రకాల జీన్స్‌లో అన్ని అధిక బరువుకు గురి చేయవు మరియు ప్రతీదీ కూడా వ్యాధికి సంబంధించింది కావు. కాబట్టి ఎటువంటి జీన్స్ ఈ వ్యాధికి కారణం అవుతున్నాయో వాటిని గుర్తించడానికి Eyleen O'Rourke - the University of Virginia's College of Arts and Sciences వారు పెద్ద పరిశోధనను మొదలు పెట్టారు. అయితే ఆ పరిశోధనలో భాగంగా సి ఎలిగాన్స్ అని పిలువబడే పురుగులను ఉపయోగించారు. ఈ చిన్న పురుగులు సూక్ష్మజీవులను తినడానికి ఇష్ట పడతాయి. దాంతో పాటు ఇవి కుళ్ళిన వృక్ష సంపదలో నివసించడానికి చాలా ఇష్టపడతాయి. అయితే ఇవి మన జీన్స్‌లో 70 శాతం పైగా పంచుకుంటాయి మరియు ఇవి అధిక శాతం చక్కెరను తింటే మనుషులు లాగ ఇవి కూడా ఊబకాయం సమస్యకి గురవుతాయి.

సి ఎలిగాన్స్ ను ఉపయోగించి ఈ పరిశోధనలో ఊబకాయం సమస్యతో బాధ పడుతున్న మనుషులలో 293 జీన్స్‌ను పరిశోధించడం జరిగింది మరియు ఈ పరిశోధనలో ముఖ్యంగా జీన్స్ వల్ల ఒబిసిటీ వస్తుందా లేదా నివారణ కలుగుతుందా తెలుసుకోవడానికి ప్రయత్నించారు.

దాని కోసం ఈ పురుగులకు సాధారణంగా తీసుకునే మంచి ఆహారంతో ఉంచారు మరి కొన్ని పురుగులకు అధికంగా ఫ్రక్టోస్ శాతం ఉన్నటువంటి ఆహారాన్ని పెట్టారు. చివరకు వాటి వల్ల 14 జీన్స్ ఒబేసిటీకు గురి చేసాయి మరియు మూడు జీన్స్ ఒబేసిటీ రాకుండా ఆ పురుగులను నివారించి దాంతో పాటు ఆ పురుగులు ఎక్కువ కాలం బతికేటట్టు చేసి మంచి న్యూరో లోకో మోటోరీ ఫంక్షన్ ని కలిగించాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "That is why we gain weight."

Post a Comment