WHO Chief about Covid
WHO Chief: కోవిడ్ అంతమయ్యేది అప్పుడే: WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్
WHO Chief about Covid: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా కొనసాగుతుంది. 2019లో చైనాలో ప్రారంభమైన మహమ్మారి ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందిపై ప్రభావం చూపింది.
దేశాలకు దేశాలు కరోనాను చూసి గజగజలాడిపోయాయి. మహమ్మారితో ప్రయాణం రెండు సంవత్సరాలు దాటి మూడో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈఏడాది చివరి నాటికి మహమ్మారి అంతమయ్యే అవకాశం ఉందంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ వెల్లడించారు. ఈక్రమంలో 2022 నూతన సంవత్సరం సందర్భంగా టెడ్రోస్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు.
ప్రపంచానికి మహమ్మారి నుంచి ఈఏడాది విముక్తి కలగాలంటే.. ముందు మనందరిలో “అసమానతలు” తొలగిపోవాలని టెడ్రోస్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో అసమానతల కారణంగా సుహృద్భావం తగ్గిపోయిందని తద్వారా, ఇటువంటి విపత్తుల సమయంలో కొందరు ప్రజలు సహాయం పొందలేకపోతున్నారని టెడ్రోస్ ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజలందరూ తనామనా తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించిననాడే కరోనా వంటి విపత్తుల నుంచి మనల్సి మనం రక్షించుకోగలమని టెడ్రోస్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు సాధారణ టీకాలు తీసుకో%లేకపోయారని, ఇతర వ్యాధులకు చికిత్సనూ కోల్పోయారని టెడ్రోస్ తెలిపారు.
కలిసికట్టుగా ప్రజలందరూ సహకారం అందించుకుని టీకాలు వేయించుకుంటేనే కరోనా వంటి మహమ్మారుల నుంచి రక్షణ పొందగలమని టెడ్రోస్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. భవిష్యత్ లో మరింత ప్రభావవంతమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నా, వాటికీ మనం సిద్ధంగా లేకపోతే మానవాళికి పెను ముప్పు వాటిల్లుతుందని టెడ్రోస్ తెలిపారు. కావున ప్రజలంతా అసమానతలు వీడి స్నేహపూర్వకంగా ఉండాలని పిలుపునిచ్చారు.
0 Response to "WHO Chief about Covid"
Post a Comment