Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Provisional allotment of employees to new districts Final allocations by March 11.

 కొత్త జిల్లాలకు ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు మార్చి 11 కల్లా తుది కేటాయింపులు.


కొత్త జిల్లాలకు ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు

ఆర్డర్‌ టు సెర్వ్‌ ప్రకారం వారి సేవలు వినియోగించుకోనున్న ప్రభుత్వం

ఇందుకోసం బదిలీలపై ఉన్న నిషేధం సడలింపు..  ఆ తర్వాత అవకాశాన్ని బట్టి పూర్తిస్థాయి విభజన

మార్చి 11 కల్లా తుది కేటాయింపులు

ఏప్రిల్‌ 2 నుంచి కొత్త జిల్లాల్లో పనిచేసేలా ఏర్పాట్లు

ఆ శాఖల హెచ్‌ఓడీలకు కీలక బాధ్యతలు 

మార్గదర్శకాలు జారీ చేసిన ఏపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ గారు 

ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు అధికారులు, ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డర్‌ టు సెర్వ్‌ ప్రకారం ఆ జిల్లాల్లో వారి సేవలను వినియోగించుకోనుంది. మార్చి 11వ తేదీలోపు తాత్కాలిక కేటాయింపులు పూర్తి చేయాలని అన్ని శాఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఆదేశించారు. కొత్త జిల్లాల అపాయింటెడ్‌ తేదీ నుంచి అధికారులు, ఉద్యోగులు కేటాయించిన చోటు నుంచి పని చేసేలా చూసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఇందు కోసం ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలించారు. ప్రస్తుతం పని చేస్తున్న వారిని ఆ జిల్లాల్లో తాత్కాలికంగా కేటాయించి, ఆ తర్వాత అవకాశాన్ని బట్టి పూర్తి స్థాయి విభజన చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా, డివిజన్‌ స్థాయి కార్యాలయాల హెచ్‌ఓడీలు, ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపునకు అనుసరించాల్సిన మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను శనివారం సీఎస్‌ సమీర్‌ శర్మ జారీ చేశారు.

కేటాయింపులకు ముఖ్య సూత్రాలు 

  • తాత్కాలిక కేటాయింపులో జిల్లా, డివిజినల్‌ కార్యాలయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్ర, రీజినల్‌/జోనల్, మండలం, గ్రామ స్థాయిలో పరిగణనలోకి తీసుకోకూడదు. 
  • జిల్లా, డివిజినల్‌ స్థాయిలో తక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న కార్యాలయాలను కేటాయింపులో వదిలేయాలి. ఆ కార్యాలయాలు ప్రస్తుతం కొనసాగే జిల్లాల పరిధిలోనే ఉండేలా చూడాలి. 
  • తుది కేటాయింపు పూర్తయ్యే వరకు తాత్కాలిక కేటాయింపు ప్రకారం పనిచేసే వారి సీనియారిటీపై ఎలాంటి ప్రభావం ఉండదు. 
  • జిల్లా/డివిజన్‌ హెడ్‌ తప్ప కొత్తగా ఏ పోస్టు సృష్టించకుండా కేటాయింపులు జరపాలి. 
  • ఉద్యోగులు, అధికారుల తాత్కాలిక కేటాయింపు చేపట్టిన విభాగాధిపతులు ఈ సూత్రాలను కచ్చితంగా పాటించాలి. 

జిల్లా కార్యాలయాల విభజన

  • జిల్లా పరిధి ఉన్న అన్ని జిల్లా స్థాయి కార్యాలయాలను తాత్కాలిక కేటాయింపునకు పరిగణనలోకి తీసుకోవాలి. వ్యవసాయ శాఖ జేడీ, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాలు ఈ కోవలోకి వస్తాయి. జిల్లా స్థాయి ఉన్నా జిల్లా పరిధి లేని కార్యాలయాలను కేటాయింపునకు పరిగణనలోకి తీసుకోకూడదు. డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాలు ఈ కోవలోకి వస్తాయి. డివిజనల్‌ స్థాయి పోలీసు కార్యాలయాలు తమ పరిధిని మార్చకుండా ప్రస్తుతం ఉన్న చోటు నుంచే పని చేయాలి. 
  • అన్ని శాఖలు జిల్లా స్థాయి పరిపాలనా యూని ట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఒకే తరహా క్యాడర్‌ ఉన్న అధికారి పోస్టును సంబంధిత శాఖకు హెచ్‌ఓడీ కోసం ఉపయోగించుకోవాలి. కొత్త జిల్లాల్లో హెచ్‌ఓడీ పోస్టుల్లో తాత్కాలిక నియామకాల కోసం సమాన స్థాయి అధికారులతోపాటు దానికి ఒక ర్యాంకు పైన, ఒక ర్యాంకు తక్కువ క్యాడర్‌ అధికారుల పూల్‌ను ఏర్పాటు చేసుకోవా లి. అందుబాటులోని రాష్ట్ర, జిల్లా, జోనల్‌ కార్యాలయాలను పరిగణనలోకి తీసుకోవచ్చు.
  • జనాభా,సర్వీస్‌ డెలివరీ యూనిట్ల సంఖ్య(ఉ దా: అంగన్‌వాడీ కేంద్రాలు), దాని పరిధి, లబ్ధి దా రుల సంఖ్య ఆధారంగా కొత్త జిల్లాలకు అధి కా రులను ఆ రేషియో ప్రకారం (ప్రొవిజినల్‌ అ లొ కేషన్‌ రేషియో) తాత్కాలికంగా కేటాయించాలి. 
  • జిల్లా కార్యాలయాల మాదిరిగానే డివిజన్‌ కార్యాలయాలను అదే డివిజన్‌ స్థాయిలో తాత్కా లిక కేటాయింపులు చేసుకోవాలి. డివిజన్‌ పరిధి ఉన్న అన్ని డివిజన్‌ స్థాయి కార్యాలయాలను తాత్కాలిక కేటాయింపులో చేర్చాలి. ఆర్డీఓ కార్యాలయాలు ఈ పరిధిలోకి వస్తాయి. డివిజన్‌ స్థాయి ఉండి, డివిజన్‌ పరిధిలోని కార్యాల యాలను కేటాయింపులో చేర్చకూడదు. ఫారెస్ట్‌ రేంజి కార్యాలయాలు ఈ కోవలోకి వస్తాయి. 

నివేదికలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి

  • పైన పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ఆయా శాఖల హెచ్‌ఓడీలు 13 జిల్లాల్లో తక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న కార్యాలయాలను గుర్తించాలి. ప్రతి జిల్లాలో ఆయా శాఖల హెచ్‌ఓడీలు తమ పరిధిలోని కార్యాలయాల్లో వేటిని విభజించాలి.. వేటిని విభజించకూడదు.. ఏవి జిల్లా, డివిజన్‌ స్థాయి కార్యాలయాలో నిర్ధారించాలి.
  • ఉద్యోగులు, అధికారులు, కార్యాలయాల విభజనపై సూచించిన విధంగా నివేదికలు తయారు చేసి జిల్లా పునర్వ్యవస్థీకరణ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 

ఆ శాఖల కార్యదర్శులు 

కార్యాలయాలు, ఉద్యోగులు, పోస్టుల తాత్కాలిక కేటాయింపులను స్క్రుటినీ చేసి ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపాలి. అనుమతిచ్చిన తర్వాత తుది కేటా యింపు జాబితా తయారవుతుంది. ఆర్థిక శాఖ చివరగా ఉద్యోగుల సేవలను ఎక్కడ వినియోగించుకుంటారో తెలుపుతూ ఆర్డర్‌ టు సెర్వ్‌ ఆదేశాలను ఆయా శాఖలకు జారీ చేస్తుంది. 

ఆర్డర్‌ టు సెర్వ్‌ ఆదేశాలు మార్చి 11వ తేదీకల్లా ఇచ్చేలా ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేయాలని సీఎస్‌ అన్ని శాఖల హెచ్‌ఓడీలు, ఆర్థిక శాఖను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తుది నోటిఫికేషన్‌ వెలువడే లోపు పూర్తి కావాలి. 

ఆర్డర్‌ టు సెర్వ్‌

తాత్కాలికంగా కేటాయించిన ఉద్యోగుల సేవలను కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో వినియోగించుకునేలా ఆర్డర్‌ టు సెర్వ్‌ ఆదేశాలు ఇవ్వాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వీరి జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ క్యాడర్లు పాత జిల్లాల్లో ఉన్నట్టుగానే కొనసాగుతాయి. తాత్కాలిక కేటాయింపులో భాగంగా జరిగిన సీనియారిటీ, పదోన్నతులు, సర్వీస్‌ అంశాలు, ఇతర సర్దుబాట్లన్నీ ప్రజా ప్రయోజనాల కోసం పరిపాలనా అవసరాల కోసం తాత్కాలికంగానే ఉంటాయి. తాత్కాలిక కేటాయింపు లేని ఉద్యోగులు పాత జిల్లాల కార్యాలయాల్లోనే అపాయింటెడ్‌ డే నుంచి పని చేయాలి. ఉద్యోగులు, అధికారుల తాత్కాలిక కేటాయింపు ప్రక్రియ కోసం బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా సడలిస్తారు. బదిలీల రవాణా అలవెన్సు వారి అర్హతలను బట్టి నిబంధనల ప్రకారం మంజూరు చేస్తారు. రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను కూడా కొత్త జిల్లాల్లో తాత్కాలికంగా పని చేసేందుకు కేటాయిస్తారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను ఏపీసీఓఎస్‌ డేటా బేస్‌ ప్రకారం కేటాయించాలి.

G.O.Ms.No.31  Dt : 26-02-2022 Districts Restructuring - Procedural Guidelines Click here

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Provisional allotment of employees to new districts Final allocations by March 11."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0