AP Government- Employees Agreement Like?
AP ప్రభుత్వం- ఉద్యోగులు ఒప్పందం కుదిరింది ఇలా ?
ఏపీ ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక హామీ లభించడంతో ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె యోచనను విరమించుకున్నాయి.
అయితే.. ఏ ఏ అంశాలపై ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చింది.. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య కుదిరిన డీల్ ఏంటి.. చూద్దాం..
ప్రభుత్వం చెప్పిన ప్రకారమే ఫిట్మెంట్ 23 శాతంగానే కొనసాగుతుంది. దీన్ని కనీసం 25 శాతమైనా చేయాలని ఉద్యోగ సంఘాలు అడిగినా కుదరలేదు. అయితే.. హెచ్ ఆర్ ఏ లో మార్పులు చేయాలని నిర్ణయించారు. 50 వేల జనాభా ఉన్న ప్రాంతాలకు 10 శాతంగా హెచ్‌ఆర్‌ఏ నిర్ణయించారు. దీనికి 11 వేల సీలింగ్ గా నిర్ణయించారు. అలాగే.. 2 లక్షల వరకు జనాభా ఉంటే 12 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు. దీనికి రూ. 13 వేల సీలింగ్ గా ఉంటుంది. అలాగే 5 లక్షల జనాభా ఉంటే 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.. అలాగే.. హెచ్ ఓడిలు , సచివాలయ ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
ఇక మరో కీలక డిమాండ్ అయిన క్వాంటం పెన్షన్‌కు కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇకపై విశ్రాంత ఉద్యోగులకు అదనపు క్వాంటం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. దీన్ని 7 మరియు 12 శాతం గా నిర్ణయించారు. అలాగే ఉద్యోగుల జీతాల నుంచి ఐఆర్ రికవరీ ఉండబోదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే 9 నెలల పాటు ఐఆర్ రికవరీని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అలాగే సెంట్రల్ పీఆర్సీ నిర్ణయం ఉపసంహరించుకునేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది.
అంటే ఇకపైనా 5 ఏళ్ళకు రాష్ట్ర స్థాయిలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కొనసాగుతుందన్నమాట. అలాగే రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయినప్పుడు మట్టి ఖర్చుల కింద రూ. 25 వేలు చెల్లింపునకు ప్రభుత్వం ఓకే చెప్పింది. సీసీఏ ను కూడా కొనసాగించాలని నిర్ణయించింది. గ్రాట్యుటీని 22 జనవరి నుంచి వర్తింప జేయాలని నిర్ణయించారు. అలాగే ఆర్టీసీ కార్మికుల కేడర్ కు సంబంధించి ప్రత్యేక జీవో జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈహెచ్ ఎస్ కూడా పొడిగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. గ్రామ వార్డు సచివలయాల ఉద్యోగుల ప్రొబేషన్ జూన్ 22 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
0 Response to "AP Government- Employees Agreement Like?"
Post a Comment