Railway Jobs
Railway Jobs: రైల్వేలో 756 ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు
భారతీయ రైల్వే పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని వాల్తేర్ డివిజన్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ వివరాలతో పాటు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు : 756
భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. ఇండియన్ రైల్వేస్ వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్‌తో (RRB) పాటు వేర్వేరు రైల్వే జోన్లు ఖాళీలను భర్తీ చేస్తుంటాయి. అందులో అప్రెంటీస్ పోస్టులు కూడా ఉంటాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని వేర్వేరు డివిజన్లలో ఉన్న యూనిట్లలో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 756 ఖాళీలు ఉన్నాయి.
విశాఖపట్నంలోని వాల్తేర్ డివిజన్లో 263 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మార్చి 7 చివరి తేదీ. ఒకరు ఏదైనా ఒక యూనిట్‌కు మాత్రమే దరఖాస్తు చేయాలి. వేర్వేరు డివిజన్లకు వేర్వేరు దరఖాస్తు ఫామ్స్ సబ్మిట్ చేస్తే పరిగణలోకి తీసుకోరు. అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, ఖాళీలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకుందాం.
East Coast Railway Recruitment 2022: ఖాళీల వివరాలు
మొత్తం ఖాళీలు - 756
- క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్,
- మంచేశ్వర్, భువనేశ్వర్ -190
- ఖుర్దా రోడ్ డివిజన్ - 237
- వాల్తేర్ డివిజన్ -263
- సంబాల్పూర్ డివిజన్ - 66
గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 08.02.2022
దరఖాస్తుకు చివరి తేదీ - 07.03.2022
సాయంత్రం 5 గంటలు
విద్యార్హతలు- 10వ తరగతి 50 శాతం మార్కులతో పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు ఫీజు- రూ.100
0 Response to "Railway Jobs"
Post a Comment