Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Latest changes in AP PRC bio elements.

AP PRC జీవో అంశాలు తాజా మార్పులు.

Latest changes in AP PRC bio elements.

 సాక్షి, అమరావతి: ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పీఆర్సీ, దానికి సంబంధించిన పలు అంశాల్లో ప్రభుత్వం రెండ్రోజులపాటు ఆయా ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపి మార్పులు చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో ఆదివారం జరిగిన మర్యాదపూర్వక భేటీలో ఉద్యోగులకు ఎంతో భరోసా కల్పించారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలూ హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. గత నెలలో ఇచ్చిన జీఓల ప్రకారం ఉద్యోగులకు కలిగే లబ్ధి ఎలా ఉంది.. సీఎం వైఎస్‌ జగన్‌ ఆమోదంతో తాజాగా చేసిన మార్పులు తర్వాత ఎలా ఉందంటే..

గత నెలలో పీఆర్సీ జీఓ ప్రకారం.
23 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని నిర్ణయించారు.
హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు.

  • 50 లక్షల జనాభా దాటితే : 24 శాతం
  • 5 నుంచి 50 లక్షల జనాభా ఉంటే : 16 శాతం (సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో పనిచేసే వారికి ఇది వర్తింపు)
  • 5 లక్షల జనాభా వరకు : 8 శాతం పెన్షనర్ల అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ (కేంద్ర వేతన సవరణ ఆధారంగా..)
  • 80 ఏళ్లు దాటిన వారికి : 20 శాతం
  • 85 ఏళ్లు దాటితే : 30 శాతం
  • 90 ఏళ్లు దాటితే : 40 శాతం
  • 95 ఏళ్లు దాటితే : 50 శాతం
  • 100 ఏళ్లు దాటితే : 100 శాతం
  • సవరించిన పే స్కేల్స్‌ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి గ్రాట్యుటీ చెల్లింపు
  • 2019 జూలై నుంచి 2021 డిసెంబర్‌ వరకు చెల్లించిన మధ్యంతర భృతిని డీఏ బకాయిల నుంచి సర్దుబాటు
  • వేతన సవరణ కాల పరిమితి కేంద్ర వేతన సవరణ కమిషన్‌ ప్రకారం వర్తింపు
  • కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ అమలు.. ఉద్యోగాల క్రమబద్ధీకరణకు చర్యలు
  • ఉద్యోగులు, పెన్షనర్ల అంత్యక్రియల ఖర్చులు రూ.25 వేలు
  • కార్యదర్శుల కమిటీ సిఫారసుల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సీసీఏ అవసరంలేదని భావించి ఉపసంహరణ
  • సీసీఏ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించాలని నిర్ణయం.
  • మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఎక్స్‌టెన్షన్‌పై త్వరితగన నిర్ణయం
  • ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌ స్కీమ్‌ క్రమబద్ధీకరణకు చర్యలు
  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను 2022 జూన్‌ 30లోపు ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్‌ వర్తింపు

తాజా చర్చల్లో ప్రభుత్వం ఆమోదించిన అంశాలు

  • గతంలో ప్రకటించిన విధంగా ఫిట్‌మెంట్‌ 23 శాతం కొనసాగింపు
  • మారిన హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు
  • 50 వేలలోపు జనాభా ఉంటే : 10 శాతం, రూ.11 వేలు సీలింగ్‌
  • 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే : 12 శాతం, రూ.13 వేలు సీలింగ్‌
  • 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా : 16 శాతం, రూ.17 వేలు సీలింగ్‌ (13 జిల్లా కేంద్రాలకు ఇదే శ్లాబు వర్తింపు)
  • 50 లక్షలకు పైబడి జనాభా ఉంటే 24 శాతం, రూ.25 వేల సీలింగ్‌
  • సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో 24 శాతం హెచ్‌ఆర్‌ఏ (2022 జూలై నుంచి 2024 జూన్‌ వరకు)

రిటైర్డ్‌ ఉద్యోగుల అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌.

  • 70-74 ఏళ్ల వయసు వారికి : 7 శాతం
  • 75-79 ఏళ్ల వయసు వారికి : 12 శాతం
  • గ్రాట్యుటీ గతంలోలా కాకుండా 2022 జనవరి నుంచి అమలు
  • 2019 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు (9 నెలలు) ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతిని సర్దుబాటు చేయరు.
  • వేతన సవరణ పరిమితి ఐదేళ్లు. కేంద్ర వేతన సవరణ కమిషన్‌ను రాష్ట్ర ఉద్యోగులకు వర్తింపజేయరు.
  • ఉద్యోగులు, పెన్షనర్ల అంత్యక్రియల ఖర్చులు రూ.25 వేలు
  • పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపు
  • మారిన హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు ఈ ఏడాది జనవరి నుంచి అమలు.
  • ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల.
  • సీపీఎస్‌ అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీ ఏర్పాటు. 2022 మార్చికల్లా దీనిపై రోడ్‌ మ్యాప్‌ రూపకల్పన
  • కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు. ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగుల అంశం దీనిలోనే పరిశీలన
  • మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఎక్స్‌టెన్షన్‌కు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల
  • ఈహెచ్‌ఎస్‌ హెల్త్‌ స్కీమ్‌ క్రమబద్ధీకరణకు చర్యలు
  • గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ 2022 జూన్‌ 30లోపు ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్‌ వర్తింపు
  • పీఆర్సీ నివేదిక విడుదల అంశం పరిశీలిస్తాం

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Latest changes in AP PRC bio elements."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0