Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Recruitment 2022

 SBI Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీ అర్హతతో SBIలో జాబ్స్ అప్లై చేయు విధానం.

SBI Recruitment 2022

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 25లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India)లో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగాల కంటే కూడా ఎక్కువ పోటీ ఉంటుంది. ఈ బ్యాంక్ లో ఉద్యోగాన్ని(Bank Jobs)  చాలా సెక్యూర్ గా భావిస్తారు నిరుద్యోగులు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (SBI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకు నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 48 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 2న ప్రారంభం కాగా.. దరఖాస్తుకు ఫిబ్రవరి 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 30న ఆన్లైన్ టెస్ట్ ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యార్హతల వివరాలు: నెట్వర్క్ సెక్యూరిటీ, రూటింగ్ అండ్ స్విచింగ్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఇతర పూర్త అర్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

వయో పరిమితి: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు ఆగస్టు 31 నాటికి 40 ఏళ్లలోపు ఉండాలి.

ఎంపిక చేయు విధానం

ప్రొవిజనల్ నాలెడ్జ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రాత పరీక్షకు 75 శాతం మార్కులు, ఇంటర్వ్యూకు మరో 25 శాతం మార్కులు మొత్తం 100 మార్కులకు అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి రూ. 36 వేల నుంచి రూ. 63840 వరకు వేతనం ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు.

అప్లై చేయు విధానం.

Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://bank.sbi/web/careers ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం Latest Announcements విభాగంలో

నోటిఫికేషన్ కింద Apply Online ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3: అనంతరం Click here for New Registration ఆప్షన్ పై క్లిక్ చేసి కావాల్సిన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.

Step 4: అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్ తో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ ను పూర్తి చేయాలి.

Step 5: అప్లికేషన్ ఫామ్ ను భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

APPLY HERE

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "SBI Recruitment 2022"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0