Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

These are the topics agreed upon in the discussions.

చర్చల్లో అంగీకరించిన అంశాలు ఇవే.

మంత్రుల కమిటీ, ఉద్యోగ నేతల మధ్య శనివారం రాత్రిజరిగిన చర్చలకు సంబంధించిన మినిట్స్‌ కాపీలో ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చిన అంశాలు ఇవీ.

1) వేతన సవరణతో ముడిపడిన అంశాలపై జీవోల జారీ సమయంలో పీఆర్సీ నివేదికను విడుదల చేస్తాం..

2) ఇప్పుడు ప్రకటించిన 23 శాతం ఫిట్‌మెంట్‌లో ఎటువంటి మార్పు ఉండదు.

3) హెచ్‌ఆర్‌ఏ స్లాబులు

4) అదనపు క్వాంటమ్‌ పెన్షన్‌ శాతాల్లో సవరణలకు ఆమోదం.. అవి..70-74 ఏళ్ల పెన్షన్‌దారులకు 7శాతం.. 75-79 ఏళ్ల పెన్షన్‌దారులకు 12 శాతం..

5) గ్రాట్యుటీ విషయంలో తగిన న్యాయం అందిస్తాం

6) ఉద్యోగులకు 2019 జూలై ఒకటి నుంచి 2020 మార్చి 31 మధ్యకాలంలో చెల్లించిన ఐఆర్‌ను రికవరీ చేయబోం.

7) కేంద్ర పీఆర్సీని భవిష్యత్తులో అమలు చేయబోం. రాష్ట్ర పీఆర్సీయే కొనసాగుతుంది.

8) మట్టిఖర్చుల కింద రూ. 25 వేలు చెల్లిస్తాం.

 9) గతంలో నిర్ణయించిన సీసీఏనే కొనసాగుతుంది.

10) సవరించిన హెచ్‌ఆర్‌ఏ కొనసాగుతుంది.

11) సెలవులు తదితర అలవెన్సులకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు కార్పొరేషన్లు, సొసైటీలు, వర్సిటీలు సహా ఇతర విభాగాలకూ వర్తిస్తాయి.

12) ప్రజా రవాణా విభాగా(పీటీడీ)నికి సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు ఇస్తాం. 

13) సీపీఎస్‌ అంశం పరిశీలనకు ఇప్పటికే కమిటీ ఉంది. ఈ మార్చిలోగా రోడ్‌మ్యాప్‌ సిద్ధమవుతుంది.

14) కాంట్రాక్టు, ఎన్‌ఎంఆర్‌ సహా ఇతర ఉద్యోగులకు సంబంధించిన కమిటీ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుంది.

15) మెడికల్‌ రియింబర్స్‌మెంట్‌ పొడిగిస్తూ సాధ్యమైనంత త్వరలో ఉత్తర్వులు ఇస్తాం. 

16) హెల్త్‌ స్కీంపై తదుపరి చర్యలు తీసుకుంటాం. 

17) గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులను ఈ ఏడాది జూన్‌ 30 నాటికి క్రమబద్ధీకరించి, సవరించిన వేతనాలు అందిస్తాం. 

జనాభా శాతం సీలింగ్

1. 50,000 లోపు 10 (11,000)

2. 50,000 - 2లక్షలు 12 (13,000)

3. 2-50 లక్షలు 16 (17,000)

4. 50 లక్షలు పైన 24 (25,000)

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "These are the topics agreed upon in the discussions."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0