Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Child Care Leave 180 Days

 Child Care Leave 180 Days  మహిళా/పురుష (Un-Married/Widower/Divorcee) ఉద్యోగులకు 180 రోజులుశిశు సంరక్షణ సెలవు (చైల్డ్ కేర్ లీవు) ఉపయోగించే విధానం

మహిళా/పురుష (Un-Married/Widower/Divorcee) ఉద్యోగులకు 180 రోజులుశిశు సంరక్షణ సెలవు (చైల్డ్ కేర్ లీవు)

G.O.Ms.No. 132(HR-IV-FR) Finance Department Dated: 06-07-2016 G.O.Ms.No. 33 (HR-IV-FR&LR) Finance Department Dated: 08-03-2022.

10వ పి.ఆర్.సి. ప్రతిపాదనలు అనుగుణంగా సర్వీసు మొత్తములో పిల్లలను పెంచు నిమిత్తము లేక పాఠశాల & కాలేజి స్థాయి. పరీక్షల సమయంలోనూ, వారి ఆనారోగ్య సమయంలలో, వగైరాలకు 2నెలలు (60రోజులు) వరకు శిశు సంరక్షణ సెలవులు క్రింద తెలుపబడిన నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకొనుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినది. ఈ సదుపాయము మహిళా ఉద్యోగులకు మాత్రమే క్రింది నిబంధనలు అనుసరించి వినియోగించుటకు అవకాశము కల్పించబడినది.

Child Care Leave 180 Days  మహిళా/పురుష (Un-Married/ Widower/ Divorcee) ఉద్యోగులకు 180 రోజులుశిశు సంరక్షణ సెలవు (చైల్డ్ కేర్ లీవు) ఉపయోగించే విధానం.   

  • 1.ఈ సెలవులను 3సార్లు తగ్గకుండా ఇద్దరి పిల్లల యొక్క వయస్సు 18 సం॥ల వరకు మరియు అశక్తులైన పిల్లల యొక్క (మానసిక/శారీరక వికలాంగులు) వయస్సు 22 సం॥లలోపు వరకు ఎన్నిసార్లు అయిననూ వినియోగించు కొనవచ్చు.
  • 2. ఈ సెలవులను యల్.టి.సి. నిమిత్తంగా వాడుకొనుటకు అవకాశము లేదు. 
  • 3. ఈ సెలవులు వినియోగించుకొనిన వివరాలు జి.ఓ. నందు పొందు పరచబడిన సంబంధిత ప్రొఫార్మా ప్రకారంగా ఇ.యల్స్ మరియు అర్ధజీతపు సెలవుల అకౌంటు మాదిరిగా సర్వీసు రిజిష్టరు నందు నమోదు పరచుకొనవలెను. 
  • 4. ఈ సెలవులు ఇ.యల్స్ మరియు అర్ధజీతపు సెలవుల అకౌంటు నుండి తగ్గించబడవు.
  • 5. ఈ సెలవులు కార్యాలయము/సంస్థ నిర్వహాణకు ఎటువంటి ఇబ్బందు లేకుండా మాత్రమే వినియోగించుకొనవలెను.
  • 6. ఈ సెలవులు వినియోగించుకొనుట హాక్కుగా భావించరాదు. మంజూరు చేయు అధికారిని ముందుగానే అనుమతి తీసుకొని మాత్రమే వినియోగించుకొనవలెను.
  • 7. ఈ సెలవులు సంపాదిత సెలవులుగానే పరిగణించాలి.
  • 8. ఈ సెలవులు ప్రసూతి సెలవులు మరియు ఇతర సెలవులతో కలుపుకొని అనగా సి.యల్స్ & స్పెషల్ సి.యల్స్ కాకుండా వినియోగించుకొనవచ్చు.
  • 9. ఉద్యోగిని యొక్క ప్రొబేషన్ కాలము నందుకూడా వినియోగించుకొనవచ్చు కాని సదరు కాలము వరకు ప్రొబేషన్ కాలము పొడిగించబడును.
  • 10. ఈ సెలవులను లీవ్ నాట్ డ్యూ గా అవకాశము కలదు.
  • పైన తెలుపబడిన సెలవులను 11వ పి.అర్.సి. ప్రతిపాదనలకు అనుగుణంగా పైన తెలుపబడిన నిబందనలు అనుసరించి 60 రోజుల నుండి 180 రోజులకు పెంచుతూ మరియు పురుష ఉద్యోగులకు (Un-Married/Widower/Divorcee) కూడా పూర్తి సర్వీసు మొత్తములో ది.01-01-2022 నుండి మాత్రమే వినియోగించుకొను అవకాశమును కల్పిస్తూ G.O.Ms.No. 33 (HR-IV-FR&LR) Fin. Deptt. Dt: 08-03-2022_ప్రకారంగా ఉత్తర్వులు జారీచేయడమైనది. 

PRESCRIBED PROFORMA FOR MAINTANING CHILD CARE LEAVE ACCOUNT IN Service Book



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Child Care Leave 180 Days"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0