Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Health care ideas

 Health care ideas : ఇవి తిన్నా , తాగినా క్యాన్సర్ బారిన పడటం ఖాయం అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం.

Health care ideas

Health care ideas: క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి ముదిరితే చికిత్స చేసినా ప్రయోజనం ఉండదు. అయితే, నివేదికల ప్రకారం.

దేశంలో క్యాన్సర్ కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది మరణిస్తున్నారు. గొంతు క్యాన్సర్, ఉదర సంబంధిత క్యాన్సర్, నోటి క్యాన్సర్, బోన్ క్యాన్సర్, రకరకాల క్యాన్సర్ మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి. అయితే, క్యాన్సర్ లక్షణాలు త్వరగా బయటపడవు. దాంతో చికిత్స అందించడం ఆలస్యం అవుతుంది. ఫలితంగా ఆ వ్యాధి ట్రీట్మెంట్‌కు కూడా లొంగదు. బాధిత వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అయితే, నిపుణుల ప్రకారం క్యాన్సర్ రావడానికి అనేక కారణాల ఉన్నప్పటికీ.. ప్రధాన కారణాల్లో మనం తినే ఆహారం ఒకటి అని చెబుతున్నారు. అవి మన శరీరానికి అనేక విధాలుగా హానీ తలపెడతాయంటున్నారు. జన్యుపరమైన కారణాల వల్ల వచ్చే క్యాన్సర్‌ను నివారించలేకపోవచ్చు, కానీ జీవనశైలి, ఆహారం వంటి కారణాల వచ్చే క్యాన్సర్లను అడ్డుకొవ్చు. దాదాపు 80 శాతం కేసుల్లో క్యాన్సర్‌కు బాహ్య కారకాలే కారణమని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. క్యాన్సర్‌కు కారణమయ్యే 3 ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాఫ్ట్ డ్రింక్.
కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్.. చాలా కాలంగా మార్కెట్‌లో ఉన్నప్పటికీ.. ప్రస్తుత కాలంలో వీటి వినియోగం మితిమీరిపోతోంది. వాటిని సేవించడం వల్ల కలిగే హాని గురించి తెలిసినప్పటికీ.. ఏమాత్రం భయపడకుండా కూల్‌డ్రింక్స్ తాగేస్తున్నారు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే ఊబకాయం సమస్య వస్తుంది. ఈ ఊబకాయం తరువాత కాలంలో క్యాన్సర్‌కు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఫాస్ట్ ఫుడ్.
పిజ్జా, బర్గర్, ఇతర ఫాస్ట్ ఫుడ్‌లు ఆరోగ్యానికి చాలా హానీ చేస్తాయి. అవి శరీరానికి హాని కలిగిస్తాయని ప్రజలకు తెలుసు.. అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా తింటూనే ఉంటారు. నిపుణుల ప్రకారం.. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలో రసాయన సమ్మేళనాలు ఏర్పడతాయి. ఈ రసాయన సమ్మేళనాలు శరీరంలో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. అలాగే కాలేయం దెబ్బతినడం, వంధ్యత్వం వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి.

మద్యం.
ప్రాణాంతక వ్యాధులు రావడానికి మద్యపానం ఒక ముఖ్యమైన కారణంగా పరిగణించబడుతుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే ఉదరం, బ్రెస్ట్, లివర్, నోరు, గొంతులో క్యాన్సర్ వ్యాధులు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Health care ideas"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0