Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Sim Card Rules

 Sim Card Rules : వారు ఇకనుంచి సిమ్ కార్డు పొందలేరు. టెలికాం శాఖ కొత్త ఉత్తర్వులు 

Sim Card Rules

New Sim Card Rules: ప్రభుత్వం మొబైల్‌ వినియోగదారుల కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది. వీటి ప్రకారం కొంతమందికి మొబైల్ కనెక్షన్ పొందడం సులభమైతే.

మరికొంతమందికి చాలా కష్టమవుతోంది. ఇంకొదరైతే కొత్త సిమ్‌ని అస్సలు పొందలేరు. నిబంధనల ప్రకారం కొత్త మొబైల్ కనెక్షన్ కోసం స్టోర్‌లకి వెళ్లనవసరం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సిమ్ కార్డ్ డైరెక్ట్‌గా ఇంటికే చేరుతుంది. ఇప్పుడు టెలికాం కంపెనీలు18 ఏళ్లలోపు వినియోగదారులకు కొత్త సిమ్‌ను విక్రయించలేవు.18 ఏళ్లు పైబడిన కస్టమర్లు మాత్రం కొత్త సిమ్ కోసం ఆధార్‌ చూపించి తీసుకోవచ్చు. ఈ మేరకు టెలికాం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు కంపెనీ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు సిమ్ కార్డ్‌లను విక్రయించదు. అంతేకాకుండా ఒక వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతుంటే అతడికి కూడా కొత్త సిమ్ కార్డ్ విక్రయించకూడదు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే ఆ సిమ్‌ను విక్రయించిన టెలికాం కంపెనీని దోషిగా పరిగణిస్తారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రీపెయిడ్‌ను పోస్ట్‌పెయిడ్‌గా మార్చడానికి కొత్త వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) ఆధారిత ప్రక్రియ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం జూలై 2019లో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం1885ని సవరించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం UIDAI ఆధారిత ధృవీకరణ ద్వారా కస్టమర్‌లు తమ ఇంటి వద్ద సిమ్‌ని పొందవచ్చు. కస్టమర్లు ఇంట్లో కూర్చొని మొబైల్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించారు. ఇంతకు ముందు కస్టమర్‌లు కొత్త మొబైల్ కనెక్షన్ కోసం KYC ప్రక్రియ ద్వారా వెళ్లాలి. లేదా మొబైల్ కనెక్షన్‌ను ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కి మార్చాలి. ఇందుకోసం ఖాతాదారులు తమ గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ పత్రాలతో స్టోర్‌కి వెళ్లాల్సి వచ్చేది. కరోనా కాలంలో కస్టమర్ల సౌలభ్యం కోసం కాంటాక్ట్‌లెస్ సేవను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని టెలికాం డిపార్ట్‌మెంట్ భావిస్తోంది.

ఆధార్ దుర్వినియోగమవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) టెలికం ఆపరేటర్లకు సరికొత్త నిబంధనలు జారీ చేసింది. సెప్టెంబరు 15 నుంచి ఈ నిబంధనలను దశలవారీగా అమలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. యూఐడీఏఐ తాజా నిబంధనల ప్రకారం.. ఇకపై సిమ్‌కార్డు కోసం ధ్రువీకరణగా ఆధార్ నంబరు ఇచ్చే వినియోగదారుల ఫేషియల్ రికగ్నిషన్‌, లైవ్‌ ఫొటో తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది. ప్రతీనెల జరిగే ధ్రువీకరణల్లో కనీసం పదిశాతం కొత్త నిబంధనల ప్రకారం ఉండాలని, లేదంటే జరిమానా తప్పదని హెచ్చరించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Sim Card Rules"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0