Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Pay grade will increase if Ashutosh Mishra's recommendations are implemented

 అశుతోష్ మిశ్రా సిఫార్సులు అమలైతే పెరగనున్న పే గ్రేడ్

Pay grade will increase if Ashutosh Mishra's recommendations are implemented

అశుతోష్‌ మిశ్రా నేతృత్వంలో 11వ పిఆర్‌సి కమిషన్‌ చేసిన సిఫార్సులను ప్రభుత్వం అమలు చేస్తే పంచాయతీరాజ్‌శాఖలో గ్రామ, మండలస్థాయి అధికారుల పే స్కేల్స్‌ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఈ అంశం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. సిఫార్సులు అమలైతే గ్రేడ్‌ 2, 3, 4 పంచాయతీ కార్యదర్శుల పే స్కేల్స్‌ రెట్టింపు కానున్నాయి.. గత పే స్కేల్స్‌లో గ్రేడ్‌-2 కార్యదర్శులు పే స్కేల్‌ గ్రేడ్‌ 11 నుంచి 13కు మార్చగా, పే స్కేల్‌ను రూ.21,230-63,010 నుంచి రూ.35,570-1,09,910కు పెంచాలని సిఫార్సు చేశారు. గ్రేడ్‌-3 పంచాయతీ కార్యదర్శులకు 18,400-55,410 పే స్కేల్‌ (పే గ్రేడ్‌ 9) నుంచి రూ.32,670-1,01,970 (పే గ్రేడ్‌ 11)కు పెంచాలని సూచించారు. అలాగే గ్రేడ్‌-4 కార్యదర్శులకు పే స్కేల్‌ గ్రేడ్‌ను 7 నుంచి 9కి పెంచాలని సిఫార్సు చేయగా, పే స్కేల్‌ రూ.16,400-49,870 నుంచి రూ.28,280-89,720కి పెంచాలన్నారు. అయితే, ప్రభుత్వం పే స్కేల్‌ గ్రేడ్‌లను పెంచినట్టు ఎక్కడా ప్రకటించలేదు. అంతేగాకుండా 2015 పిఆర్‌సి బేసిక్‌పైనే ప్రభుత్వం రెండు నెలల నుంచి జీతాలు చెల్లిస్తోంది. మిశ్రా కమిషన్‌ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేస్తే, మెరుగైన వేతనాలు లభిస్తాయని పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. గతంలో మండల పరిషత్‌ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (సూపరింటెండెంట్‌), గ్రేడ్‌ -1 పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్‌ గ్రేడ్‌ 17 ఉండగా, ఎఒ గ్రేడ్‌ను మాత్రం ఇఓఆర్‌డితో సమానంగా పెంచాలని సిఫార్సు చేయగా, గ్రేడ్‌-1 పంచాయతీ కార్యదర్శుల గ్రేడ్‌ను మాత్రం యధావిధంగా ఉంచేలా సిఫార్సు చేశారు. తాజా సిఫార్సుల మేరకు ఇఓఆర్‌డి, ఎఒలకు రూ.45,830-1,30,580 పే స్కేల్‌ రానుండగా, గ్రేడ్‌-1 పంచాయతీ కార్యదర్శులకు రూ.44,570-1,27,480 పే స్కేల్‌ను వర్తింప చేయాలని సిఫార్సు చేశారు.. కొత్త పిఆర్‌సి ప్రకారం ఇంకా పే ఫిక్సేషన్‌ జరగలేదని, ఫిక్సేషన్‌ సమయంలో పే స్కేల్‌ గ్రేడ్‌లలో మార్పులు చేర్పులు చేసేలా ప్రభుత్వం నియమించిన అభ్యంతరాల కమిటీకి వినతిపత్రాన్ని అందజేస్తామని సంఘం ప్రతినిధులు తెలిపారు.                                              సచివాలయ ఉద్యోగుల ప్రస్తావనే లేదు

అశ్‌తోష్‌ మిశ్రా పిఆర్‌సి నివేదికలో కొత్తగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రస్తావనే లేదు. వాస్తవానికి కమిషన్‌ ఏర్పాటైన ఏడాది తర్వాత సచివాలయ ఉద్యోగుల నియామకం జరిగింది. దీంతో కమిషన్‌ నివేదికలో వారి పే స్కేల్స్‌ గ్రేడ్‌, వేతనాల అంశాన్ని ప్రస్తావించలేదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Pay grade will increase if Ashutosh Mishra's recommendations are implemented"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0