Post Office Jobs
Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్.ఖాళీల వివరాలు ఇవే.
Post Office Jobs ఇండియా పోస్ట్ (India Post) పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. అప్లై చేయడానికి మరో రెండు రోజులే గడువుంది. విద్యార్హతలేంటో, ఎలా అప్లై చేయాలో తెలుసుకోగలరు.
1. పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ (India Post) మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తమిళనాడు పోస్టల్ సర్కిల్లో స్టాఫ్ కార్ డ్రైవర్ (Staff Car Driver) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి. కొయంబత్తూర్, ఈరోడ్, నీల్గిరీస్, సేలం, తిరుప్పూర్ ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి.
2. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్స్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోగలరు.
3. మొత్తం 17 ఖాళీలు ఉండగా అందులో మెయిల్ మోటార్ సర్వీస్, కొయంబత్తూర్- 11, ఈరోడ్ డివిజన్- 2, నీల్గిరీస్ డివిజన్- 1, సేలం డివిజన్- 2, తిరుప్పూర్ డివిజన్- 1 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మార్చి 10 చివరి తేదీ.
4. డిప్యుటేషన్, అబ్సార్ప్షన్ పద్ధతిలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. ఎంపికైనవారికి ఏడో పే కమిషన్‌లోని లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. విద్యార్హతల వివరాలు చూస్తే 10వ తరగతి పాస్ కావాలి. లైట్ మోటార్ వెహికిల్, హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అభ్యర్థుల వయస్సు 56 ఏళ్ల లోపు ఉండాలి.
5. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. రిక్రూట్మెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలి. నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.
6. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేయాలి. చివరి తేదీలోగా చేరేలా పోస్టులో అప్లికేషన్ ఫామ్స్ పంపాలి. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: The Manager Mail Motor Service, Goods Shed Road, Coimbatore – 641001.
7. ఇండియా పోస్ట్ వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్ ద్వారా దేశంలో ఉన్న అన్ని పోస్టల్ సర్కిళ్లలో ఖాళీలను భర్తీ చేస్తోంది. పోస్ట్ ఆఫీస్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ ఫాలో కావాలి
0 Response to "Post Office Jobs"
Post a Comment