Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

"Prices will come under control soon. There is no threat to our economy." Reserve Bank Governor Shakti Kant Das

 ' త్వరలోనే ధరలు అదుపులోకి మన ఆర్థిక వ్యవస్థకు ముప్పు లేదు '. రిజర్వ్​ బ్యాంక్​ గవర్నర్​ శక్తి కాంత్ దాస్

"Prices will come under control soon. There is no threat to our economy."  Reserve Bank Governor Shakti Kant Das

Indian Economy: ధరలు త్వరలోనే అదుపులోకి వస్తాయని అన్నారు భారతీయ రిజర్వ్​ బ్యాంక్​ గవర్నర్​ శక్తి కాంత్ దాస్​. అధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగంతో ఇబ్బందులు ఎదుర్కొవడంతో పాటు మందగమనానికి లోనయ్యే పరిస్థితి దేశ ఆర్థిక వ్యవస్థకు లేదని తెలిపారు.

Indian Economy: అత్యధిక ద్రవ్యోల్బణం, అధిక నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ, మందగమనానికి గురయ్యే పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థకు రాదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నరు శక్తికాంత దాస్‌ భరోసా ఇచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి పరిణామాల ప్రభావం మనపై చాలా తక్కువగా ఉన్నందున, ధరలు త్వరలోనే అదుపులోకి వస్తాయనే అంచనాను సీఐఐ నిర్వహించిన సదస్సులో దాస్‌ వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 8.9 శాతంగా ఉంటుందనే అంచనా వేశామని, ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల ప్రభావం దీనిపై స్వల్పంగా ఉండొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయ అనిశ్చితి దీర్ఘకాలం కొనసాగితే మాత్రం, వృద్ధిపై ఏడాది పాటు ప్రభావం పడుతుందని, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు శ్రమించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఆర్‌బీఐ లక్షిత రిటైల్‌ ద్రవ్యోల్బణం (2-6 శాతంలో) గరిష్ఠ స్థాయికి కాస్త అధికంగా గత రెండు నెలల్లో నమోదైనా, మున్ముందు అదుపులోకి వస్తుందనే అంచనాను దాస్‌ వ్యక్తం చేశారు.. జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదైన సంగతి విదితమే. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనే భవిష్యత్తు ద్రవ్యోల్బణ అంచనాలను వెలువరిస్తామని దాస్‌ చెప్పారు

రూపాయి మారకపు విలువలోనూ స్థిరత్వం రావొచ్చని దాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి సవాళ్లనైనా తట్టుకోగలిగే స్థితిలో మన ఆర్థిక వ్యవస్థ ఉందని, విదేశీ మారకపు నిల్వలు అధికంగా ఉండటం, కరెంటు ఖాతా లోటు తక్కువగా ఉండటం ఇందుకు ఉపకరించే అంశాలని వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించాక, ముడిచమురు సహా కీలక కమొడిటీ ధరలు పెరగడంతో, ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతుండటాన్ని ఆయన ప్రస్తావించారు. డాలరు మారకపు విలువ ఈనెలలో రూ.77.27కు చేరిన నేపథ్యంలో, రూపాయి విలువను కాపాడేందుకు తన నిల్వల నుంచి 10 బిలియన్‌ డాలర్లను ఆర్‌బీఐ విక్రయించింది. గత దశాబ్ద కాలంలోనే ఈ స్థాయిలో ఆర్‌బీఐ కార్యాచరణకు దిగలేదు. శ్రీలంకలో గరిష్ఠస్థాయులకు చేరిన ధరలతో ప్రజలు అల్లాడుతున్న నేపథ్యంలో, ఆర్‌బీఐ గవర్నర్‌ ఈ భరోసా ఇచ్చారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to ""Prices will come under control soon. There is no threat to our economy." Reserve Bank Governor Shakti Kant Das"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0