Review on the Department of Education
ఉపాధ్యాయుల సేవలను ఆ కార్యక్రమాల్లో వినియోగించుకోవద్దు: సీఎం జగన్.
విద్యాశాఖపై సమీక్ష నిర్వహంచిన సీఎం.. ఉపాధ్యాయుల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ వాడుకోకూడదన్నారు. ఉపాధ్యాయులు పూర్తిగా విద్యార్థుల చదువులకు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఉపాధ్యాయుల సేవలను బోధనేతర కార్యక్రమాలకు.. ఎట్టిపరిస్థితుల్లోనూ వాడుకోకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీనివల్ల విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. మ్యాపింగ్, సబ్జెక్టులవారీ టీచర్లు, ఆంగ్ల బోధన, డిజిటల్ లెర్నింగ్‌పై చర్చించారు. ఉపాధ్యాయులు పూర్తిగా విద్యార్థుల చదువులకు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాలు ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న శిక్షణా కేంద్రాలలో నాడు – నేడు కింద సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు.
మార్చి 15 నుంచి నాడు-నేడు రెండోవిడత మొదలు పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరిచే నాటికి.. పిల్లలకు విద్యాకానుక అందించాలన్నారు. రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను ఆచరణలోకి తీసుకురావడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో.. ఒక స్కిల్ కాలేజీతో పాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ITI కళాశాల ఉండాలని విద్యాశాఖ అధికారులకు సీఎం జగన్ నిర్దేశించారు.
"టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాల్లో వాడకూడదు. టీచర్లు పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. కొత్త జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు ఉండాలి. ప్రస్తుత కేంద్రాల్లో కూడా వసతులు మెరుగుపరచాలి. ఈ నెల 15 నుంచి బడుల్లో నాడు-నేడు రెండోవిడత పనులు. అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా ఆటస్థలాలు ఏర్పాటు చేయాలి. బడులు తెరిచే నాటికి పిల్లలకు విద్యాకానుక అందించాలి. నైపుణ్యాల అభివృద్ధి ప్రణాళికను వెంటనే ఆచరణలోకి తేవాలి. నైపుణ్య మానవ వనరుల చిరునామాగా ఏపీ తయారుకావాలి." - జగన్, ముఖ్యమంత్రి
0 Response to "Review on the Department of Education"
Post a Comment