Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sreesailam Mahaa Sivaratri

 అందరి కన్నులు పాగాలంకరణ పైనే

మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలంలో పాగాలంకరణకు ప్రత్యేక విశిష్టత కలదు. శైవక్షేత్రాల్లో మరెక్కడా జరగని విశిష్టసేవ శ్రీశైలజ్యోతిర్లింగమూర్తికి మూడు తరాలుగా చేపడుతోన్న అద్వితీయ సేవే ఈ పాగాలంకరణ.

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లింగోద్భవకాలన జరిగే పాలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. శైవక్షేత్రాల్లో మరెక్కడా జరగని పాగాలంకణ సేవ శ్రీశైలక్షేత్రంలో జరగడం విశేషం. శ్రీగిరి పర్వతాన స్వయంభూవై వెలిసిన మల్లికార్జునుడు శ్రీలింగచక్రవర్తిగా ప్రస్తుతించబడుతున్నాడు. ఆగమశాస్త్రాల్లోని రాజోపచారాల్లో ఛత్రం, చామరం, వాహనం, నృత్యం, గీతం, వాద్యం, మకుటం వంటి ఉపచారాలు నిర్వహించడం సహజ. వీటిలో మకుటం కలది కిరీటం. దీన్ని తలపాగను సైతం వినియోగిస్తారు. ఈ తరహా మకుట సమర్పణే పాగాలంకరణ.

తాత్వికపరంగా ప్రపంచం భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలతో నిండి ఉంది. పంచభూతాలకు ప్రతీకగా స్వామివారి గర్భాలయ విమాన గోపురానికి మధ్యలో ప్రధాన కలశం నలుమూలలా నాలుగు కలశాలనే చెప్పవచ్చు. అలాగే వృషభం ధార్మికతకు ప్రతీక అయితే గర్భాలయ ముఖమండపంపై ఉన్న నవనందులు, అయిదు కలశాలకు కలిపి పాగా చుట్టబడుతుంది. 14 లోకాల్లో మల్లన్న అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించే సేవ ఇది.

ప్రకాశం జిల్లా హస్తినాపురానికి చెందిన ఫృధ్వీవెంకటేశ్వర్లు అనే భక్తుడి కుటుంబం మూడు తరాలుగా శ్రీశైలమల్లన్నకు పాగాను అలంకరిస్తోంది.స్వామివారికి పాగాను వంశపారంపర్యంగా సమర్పిస్తున్నారు. ఏడాదిపాటు దీక్షలో ఉండి రోజుకు ఒక మూర చొప్పున 365 రోజులు పాగా వస్త్రాన్ని నేస్తారు. కావున మల్లన్నకు మహాశివరాత్రి రోజున నిర్వహించే పాగాలంకరణను దర్శించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆ ఏడాది అంతా శు భాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణానికి ముందు పెండ్లికుమారుడికి తలపాగా చూటే ఆచారశైలిని అనుసరించి తరతరాలుగా ఏటేటా పాగాలంకరణ సేవ చేస్తున్నారు ఫృధ్వీవెంకటేశ్వర్లు కుటుంబం.

స్వామివారిని పాగాను ఎంతో భక్తి, దీక్షతో ప్రతిరోజు ఉదయం ఒక మూరచొప్పున 365 రోజులపాటు నేస్తుంది. మహాశివరాత్రి పర్వదినం నాటికి శ్రీశైలం చేరిన సదరు కుటుంబానికి దేవస్థానం ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి ఆతిధ్యం ఇస్తోంది. ఫృధ్వీవెంకటేశ్వర్లు శివరాత్రి రోజున చిమ్మచీకట్లో దిగంబరుడై స్వామివారి గర్భాలయ విమాన కలశాలు, ముఖమండప నవనందులను కలుపుతూ పాగాలను అలంకరిస్తారు. ఆ సందర్భంగా ఒంటిపై నూలు పోగు లేకుండా, చిమ్మచీకటిలో పాగా అలంకరణ చేయడం ఇక్కడ విశిష్టత. వీటిని శ్రీశైలంకు వచ్చిన అశేషభక్తజనం తిలకిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sreesailam Mahaa Sivaratri"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0