Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSC MTS Recruitment 2022

 మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్), హవల్దార్ (సీబీఐసీ అండ్ - సీబీఎన్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2021 – పూర్తి వివరాలు.

SSC MTS Recruitment 2022

భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వ శాఖ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్), హవల్దార్ (సీబీఐసీ అండ్ - సీబీఎన్) స్టాఫ్ ఎగ్జామినేషన్ 2021

1) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ - టెక్నికల్): ఖాళీల వివరాలు తర్వాత వెల్లడిస్తారు.

2) హవల్దార్ (సీబీఐసీ అండ్ సీబీఎన్): 3603

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ (పదో తరగతి) పరీక్ష/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: వివిధ విభాగాలను అనుసరించి 01.01.2022 నాటికి 18-25 ఏళ్లు, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ యవసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎసీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

పరీక్షా విధానం: దీనిలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ టైప్, పేపర్-2 డిస్కిప్టివ్ పద్ధతిలో ఉంటుంది. పేపర్-1 పరీక్షా పద్దతి కింది విధంగా ఉంటుంది .

పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉటుంది.

పేపర్-2 డిస్కిప్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇది 50 మార్కులకు ఉంటుంది. షార్ట్ ఎస్సే/ లెటర్ ఇన్ ఇంగ్లిష్ రాయాల్సి ఉంటుంది. పరీక్షా సమయం 45 నిమిషాలు కేటాయిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.03.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.04.2022.

ఆన్ లైన్ లో ఫీజు చెల్లించడానికి చివరి తేది: 02.05.2022

చలాన ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేది: 08.05.2022.

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్-1): 2022, జులై.

టైర్-2 పరీక్ష తేది (డిస్కిప్టివ్ పేపర్): వెల్లడించాల్సి ఉంది. 


NOTIFICATION


WEBSITE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSC MTS Recruitment 2022"

Post a Comment