Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Amaravati lesson removed

 Amaravati : ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం .. 10 వ తరగతి పాఠ్యాంశం నుంచి ' అమరావతి ' పాఠం తొలగింపు .

Amaravati lesson removed

Amaravati lesson removed: అమరావతిని కేంద్రంగా చేసుకుని శాతవాహన రాజులు.. వారికంటే ముందు పాలకులు ఏ విధంగా పరిపాలన సాగించారు.. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎందుకు ఎంపిక చేసింది.

ఇలా అనేక అంశాలను వివరిస్తూ 10వ తరగతి తెలుగు పుస్తకంలో 2వ పాఠంగా అమరావతిని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ముద్రించారు. అయితే.. ఈ సంవత్సరం 10 తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల్లో గతంలో బోధించిన అమరావతి పాఠాన్ని తొలగిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అయితే.. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ (AP Education Ministry) ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల చర్చనీయాంశంగా మారింది. కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున విద్యార్థులపై భారం పడకూడదని వివిధ సబ్జెక్టుల్లో కొన్ని పాఠాలను తొలగించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే.. ఈ ఆదేశాలందే నాటికే పాఠశాలల్లో అమరావతి పాఠాన్ని బోధించినట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

అమరావతి పాఠం తొలగింపుపై పలు విధాలుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిలబస్‌ భారం తగ్గించాలంటే పుస్తకం చివర్లోని పాఠాలను తొలగించే వీలుండగా కావాలనే అమరావతిని తీసివేశారంటూ పలువురు పేర్కొంటున్నారు. అయితే.. ఈ నెల 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్‌ పరీక్షలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి, వెన్నెల పాఠాలు మినహాయించి మిగిలినవి చదువుకుని పరీక్షలకు సిద్ధం కావాలని ఉపాధ్యాయులు సూచనలు చేస్తున్నారు. విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని పేర్కొంటున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Amaravati lesson removed"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0