Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP govt to introduce English Medium for 8th class students: 2022-23

 ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ 8 వ తరగతిలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం : సీఏం జగన్

AP govt to introduce English Medium for 8th class students: 2022-23


AP govt to introduce English Medium for 8th class students: 2022-23 విద్యాసంవత్సరంలో 8వ తరగతిలో ఇంగ్లీష్‌ మీడియం (English Medium) ప్రారంభించాలని సీఏం జగన్‌ నేడు (ఏప్రిల్‌ 13) క్యాంప్‌ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో తెలిపారు.

ఈ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రతి మండలానికీ 2 జూనియర్‌ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, వాటిల్లో అమ్మాయిలకు ప్రత్యేకించి ఒక కాలేజీ ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఈ ఏడాది జగనన్న విద్యాకానుకకు (Jagananna Vidya Kanuka) అంతా సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్ధులకు విద్యాకానుక అందించేలా చర్యలు తీసుకోవాలని సీఏం ఆదేశించారు. ఇక ఈ ఏడాది విద్యాకానుకకు దాదాపుగా రూ.960 కోట్లు ఖర్చు అవ్వనుందని, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరూ మన పిల్లలే, వారిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

నాడు - నేడు రెండో దశ పనులపై ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. రెండో దశ పనుల వేగం పెంచాలన్నారు. రెండోదశ కింద దాదాపు 25 వేల స్కూళ్లలో పనులు ప్రారంభించాలని, ఈ పనుల ద్వారా ఈ ఏడాది స్కూళ్లలో గణనీయమైన మార్పులు కనిపించాలని అధికారులను ఆదేశించారు. దీంతో చరిత్రలో మన ప్రభుత్వం పేరు, భాగస్వాములైన అధికారుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. నాడు-నేడు రెండోదశ ఖర్చు రూ. 11,267 కోట్లుగా అంచనా వేశారు. విద్యావ్యవస్థలో మహిళా పోలీసులు నిర్వర్తించాల్సిన విధులపై సీఎం ఆదేశాలమేరకు అధికారులు ఎస్‌ఓపీని రూపొందించినట్లు తెలిపారు. స్కూళ్లు, కాలేజీల్లో భద్రతపై మహిళా పోలీసులు విద్యార్ధులకు అవగాహన కల్పించనున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP govt to introduce English Medium for 8th class students: 2022-23"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0