Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP New Cabinet

 AP New Cabinet : కొత్త మంత్రుల జాబితా రెడీ ? మళ్లీ కొనసాగేది ఎవరు .. ఏ లెక్కన ఎవరికి ఛాన్స్ 

AP New Cabinet

AP New Cabinet: సీఎం జగన్ ఎన్నికల టీం ఇదే..? పాత.. కొత్తల కలయికతా జంబో కేబినెట్ ను సీఎం రెడీ చేసుకున్నారా..? ఆ జాబితాలో చోటు దక్కించుకున్నది ఎవరు.. ఏ ప్రాతిపదికన పాత వారికి అవకాశం కల్పించారు..? కొత్త వారి విషయంలో ఎలాంగి జాగ్రత్తలు పాటించారు.

AP New Cabinet: సీఎం జగన్ (CM Jagan) తన ఎన్నికల టీంను రెడీ చేసుకున్నారు. పూర్తి వడపోతల తరువాత.. మంత్రి వర్గం తుది జాబితాను సిద్ధం చేశారు. తాజాగా మంత్రుల రాజీనామా లేఖలతో ఒక కవర్.. కొత్త కేబినెట్ (AP New Cabinet) లో చేరుతున్న జాబితాతో మరో కవర్ ను గవర్నర్ కు పంపించినట్టు సమాచారం. కేబినెట్ లో ఉండేది ఎవరు అన్నదానిపై.. రేపు వారికి సమాచారం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొత్త కేబినెట్‌ కూర్పుపై జగన్ పూర్తి కసరత్తు పూర్తి చేశారు. రేపటికి అందరికీ సమాచారం పంపించి.. ఎల్లుండి ఉదయం ప్రమాణస్వీకారం కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని పిలుపు ఇవ్వనున్నారు. కొత్త మంత్రులెవరు? పాత మంత్రులెవరిని కొనసాగించాలి అన్నదాన్ని సీఎం ఫైనల్ చేసినా.. బయటకు మాత్రం సమాచారం పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. నేరుగా సీఎంఓ నుంచి వారికి సమాచారం అందిన తరువాతే పేర్లు బయటకు రావాలని అధినేత భావిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ జాబితాలో సీనియర్ల జాబితాపై లీకులపై లీకులు వస్తున్నాయి. మొదటి ఇద్దరు, ముగ్గురుని కొనసాగించాలని సీఎం భావించినా.. ఇప్పుడు ఆ సంఖ్య పదికి చేరినట్టు వైసీపీ వర్గాల టాక్. మొన్న కేబినెట్ భేటీలోనే దీనిపై క్లారిటీ వచ్చింది. కానీ పేర్లను మాత్రం సీఎం జగన్ ఆ రోజు రివీల్ చేయలేదు.

ముఖ్యంగా 2024 ఎన్నికలపైన సీఎం జగన్ ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాను పార్టీని పట్టించుకోకుండా.. పాలనకే సమయం వెచ్చిస్తే ప్రమాదం తప్పదని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే మొదట ఇద్దరు ముగ్గురు అనుకున్న జాబితాను 10కి పైగా పెంచారు. అనుభవం పేరుతో కొంతమంది మరోసారి ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. తాను పార్టీ కార్యక్రమాలు.. బలోపేతంపై ఫోకస్ చేస్తే.. పాలన చూసుకోవడానికి సీనియర్ల అవసరం ఉందని ఆయన నిర్ణయానికి వచ్చారు. అందుకే పాత మంత్రుల జాబితాను పెంచారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న బొత్స (Botsa), పెద్దిరెడ్డి (Peddireddy), కొడాలి నాని (Kodali Nani), బుగ్గన (Buggana) , పేర్ని నాని (Perni Nani), అనిల్ (Anil), బాలినేని (Balineni), కన్నబాబు (Kannababu)లను అనుభవం ప్రకారం కొనసాగించే అవకాశం ఉంది.

ఇక సామాజిక సమీకరణాల ప్రకారం మంత్రులు జయరామ్, వేణుగోపాల్, అప్పలరాజు, సురేష్, అంజాద్ బాషా, శంకర్ నారాయణ, తానేటి వనితను కొత్త కేబినెట్‌లోకి తీసుకుంటారని వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన వారిలో 14 నుంచి 15 మంది వరకు మాత్రం కొత్త ముఖాలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. అది కూడా కేవలం సామాజిక, రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే ఎంపిక ఉంటుంది అంటున్నారు. ఈ కొత్త కేబినెట్ కూర్పుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సుదీర్ఘంగా చర్చించన తరువాత సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP New Cabinet"

Post a Comment