Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Don't have rats in your house .. send them out like this without killing them!

  ఇంట్లో ఎలుకలు బెడదా.. చంపకుండానే వాటిని ఇలా బయటకు పంపొచ్చు!

Don't have rats in your house .. send them out like this without killing them!

ఇంట్లో ఎలుకలు ఉండే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావండోయ్… ఇంట్లో ఏం పెట్టినా వాటిని కొరికేయడం, దొరికిన పప్పులు, బియ్యం వంటి ఎన్నో రకాల ఆహార పదార్థాలను తినేయడం వంటివి చేస్తుంటాయి.

అనేక రోగాలను ఆ ఆహార పదార్థాలపై వదిలి వెళ్తుంటాయి. ఎలుకలు తిన్నట్లు తెలియక మనం తిన్నామంటే ఇక మన పని అంతే. అయితే ఎలుకల సమస్యతో బాధ పడేవారు చాలా మందిని వాటిని చంపేందుకు తెగ కష్టపడిపోతుంటారు. కొందరు మందు తీసుకొచ్చి పెట్టి, మరికొందరు వాటిని పట్టుకొని చంపడం లేదా కరెంట్ షాకుతో చంపండం చూస్తుంటాం. అయితే కొందరికి మాత్రం వాటిని చంపడానికి ఇష్టపడరు. అలా అని వాటిని ఇంట్లో ఉంచుకోవడానికి కూడా ఇష్టపడరు. అయితే ఎంత కష్టమైన సరే వాటిని చంపుకుండా ఇంటి నుంచి బయటకు పంపించాలని చూస్తుంటారు.

అలాంచి వారి కోసమే మేం ఓ చక్కటి చిట్కాను చెప్పబోతున్నాం. అయితే అదేంటో మీరు తేలుసుకోండి.పుదీనా ఆయిల్ వంటి ఘాటైన వాసన గల నూనెల వల్ల ఎలుకలు బయటకు వెళ్లిపోతాయట. అయితే ఈ నూనెను ఇంట్లోని మూలలు, సందుల్లో పెట్టడం వల్ల రెండు రోజుల్లోనే ఎలుకలన్నీ బయటకు వెళ్లిపోతాయట. అంతే కాకుండా లవంగాల వాసన చూపించి కూడా వాటిని బయటకు తరమొచ్చట. ఘాటు వాసనలను ఎలుకలు ఎంత మాత్రం తట్టుకోలేవట. అలాగే కారం పొడి వాసనను కూడా అవి తట్టుకోలేవట. ఒక పాత గుడ్డలో కొద్దిగా కారం పొడి పోసి ఒక సంచిలో పెట్టి ఎలుకల రంధ్రాల దగ్గర పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఆ వాసన భరించలేక ఎలుకలు బయటకు పారిపోతాయి. ఎలుకలే కాకుండా చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు వంటివి కూడా బయటకు వెళ్లిపోతాయి.

how to get rid of rats in house fast with jilledu

అలాగే ఉల్లిపాయల వాసన కూడా ఎలుకలకు పడదు. వాటిని కట్ చేసి పెట్టడం వల్ల ఆ ఘాటుకు ఎలుకలు బయటకు పరుగులు పెడ్తాయి. అంతే కాదండోయ్ బేకింగ్ సోడా వేసి కూడా ఎలుకలను ఇంటి నుంచి బయటకు పంపిచేయొచ్చు. బేకింగ్ సోడా వల్ల ఎలుకలకు ఊపిరి ఆడదు. కాబట్టి అవి త్వరగా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాయి. ఇక పొలాల్లో ఉండే ఎలుకలను బయటకు పంపించాలంటే జిల్లేడు ఆకులు, పాలను వాడాలట. జిల్లేడు పాల వల్ల ఎలుకలు చనిపోతాయట. నువ్వుల్లో జిల్లేడు పాలు కలిపి ఉండలు చుట్టి పొలంలో పలు చోట్ల వేయడం వల్ల ఎలుకలు చనిపోతాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Don't have rats in your house .. send them out like this without killing them!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0