Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Health Tips

 Health Tips : వీటితోపాటు ట్యాబ్లెట్స్ అస్సలు తీసుకోవద్దు. మర్చిపోతే ప్రాణాలకే ప్రమాదం.

Health Tips

ప్రస్తుతం చాలా మంది చిన్నపాటి నొప్పికి కూడా ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తున్నారు. తలనొప్పి, కీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిడి, జలుబు ఇలా ప్రతి సమస్యకు ట్యాబ్లెట్స్ వినియోగిస్తున్నారు.

అయితే మార్కెట్లో లభించే ప్రతి మందుల వెనక వాటికి సంబంధించిన సమాచారం ఉంటుంది. కానీ దానిని ఎవరు పట్టించుకోరు. ట్యాబ్లె్ట్స్‏తోపాటు కొన్ని పదార్థాలను తీసుకోవడం వలన అనేక దుష్ర్పభావాలు ఉంటాయి. దీంతోపాటు.. ఖాళీ కడుపుతో ఏదైనా మందు తీసుకోవాలి.. ఆహారం తీసుకున్న తర్వాత ఎలాంటి మందులు వేసుకోవాలి అనేది మందుల వెనక ఉంటుంది. సాధారణంగా మనం ట్యాబ్లెట్స్ తీసుకునేటప్పుడు నీళ్లతో కలిపి తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అయితే పొరపాటున కూడా కొన్ని రకాల పానీయాలతో మందులు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌదీ ఫార్మాస్యూటికల్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం కొన్ని డ్రింక్స్ తోపాటు మందులు తీసుకోవడం వలన కలిగే ప్రభావాలను వెల్లడించింది. అవెంటో తెలుసుకుందామా.

కాఫీ.. మెడిసిన్‏తోపాటు కెఫిన్ తీసుకోవడం వలన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. కాఫీ వంటి వేడి పానీయాలంతో మందులు తీసుకోవడం వలన అది కరగడానికి ఎక్కువ సమయం పడుతుందని అధ్యాయనంలో తెలీంది. కాఫీ లేదా మరే ఇతర వేడి పానీయాలతో మందులు తీసుకోవడం వలన మీ ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

ఆరెంజ్ జ్యూస్.. సాధారణంగా చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేటప్పుడు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటారు. అలాగే.. ఆరెంజ్ జ్యూస్ తోపాటు ట్యాబ్లెట్స్ కూడా తీసుకుంటారు. కానీ ఇలా తీసుకోవడం వలన ట్యాబ్లెట్స్ కరగడానికి ఎక్కువ సమయం పడుతుందని.. విటమిన్ సీతో ట్యాబ్లెట్స్ తీసుకోవడం వలన మరిన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. విటమిన్ సీ పానీయాలతో ట్యాబ్లెట్స్ తీసుకోవద్దు.

కోకా.. కోలా… వేసవిలో అందరూ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగేస్తుంటారు. ఎండవేడిని తట్టుకునేందుకు ఎక్కువగా చల్లటి డ్రింక్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అదేసమయంలో వీటితోపాటు ట్యాబ్లె్ట్స్ తీసుకుంటారు. కానీ ఇలా చేయడం వలన అనారోగ్యానికి గురవుతారు.

ఎనర్జీ డ్రింక్స్. ఎనర్జీ డ్రింక్స్ తోపాటు ట్యాబ్లెట్స్ తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.

మజ్జిగ.. వేసవిలో మజ్జిగను ఎక్కువగా తీసుకుంటారు. అయితే మజ్జిగతోపాటు ట్యాబ్లెట్స్ అస్సలు తీసుకోవద్దు. మర్చిపోతే ట్యాబ్లెట్స్ శోషణ, విచ్ఛిన్న ప్రక్రియ మజ్జిగ ద్వారా ప్రభావితమవుతుంది. అందుకే ట్యాబ్లెట్స్ తీసుకునేటప్పుడు కేవలం నీటిని మాత్రమే తీసుకోవాలంటున్నారు నిపుణులు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Health Tips"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0