Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Mudra loans for small businesses

 చిన్న బిజినెస్​లకు ముద్రా లోన్లు

Mudra loans for small businesses


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై)ను మొదలుపెట్టింది.

ఈ స్కీమ్ ​ద్వారా చిన్న వ్యాపారాలు వాటి ఆర్థికపరమైన అవసరాల కోసం రూ. 10 లక్షల వరకు లోన్​ను పొందవచ్చు. ప్రభుత్వ డేటా ప్రకారం గత ఏడు సంవత్సరాలలో, పీఎంఎంవై కింద రూ. 18.60 లక్షల కోట్ల విలువైన లోన్లను ఇచ్చారు. ఇందుకోసం మొత్తం 34.42 కోట్లకు పైగా లోన్​ ఖాతాలు తెరిచారు. పీఎం ముద్రా యోజన, వాటిలో రకాలు, పొందడానికి అర్హత, ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?... తదితర వివరాలు తెలుసుకుందాం.

పీఎంవైవై కింద మూడు రకాల లోన్లు పొందవచ్చు. అవి కింది విధంగా ఉన్నాయి

  • 1. శిశు: రూ. 50వేల- వరకు లోన్లను ఇస్తారు.
  • 2. కిషోర్: రూ. 50వేల- నుంచి 5 లక్షల వరకు.
  • 3. తరుణ్: రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు లోన్లను మంజూరు చేస్తారు.
  • తరుణ్ లోన్ కోసం లోన్ మొత్తంలో 0.50శాతం (వర్తించే పన్నుతో పాటు) ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. శిశు, కిషోర్ లోన్లకు ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.

పీఎంవైవై లోన్లకు అర్హతలు

  • తయారీ, ప్రాసెసింగ్, ట్రేడింగ్ లేదా సర్వీస్​ సెక్టార్​ వంటి వ్యవసాయేతర రంగం ఆదాయాన్ని పొందడం కోసం బిజినెస్​ ప్లాన్​ఉన్న వాళ్లు రూ. 10 లక్షల కంటే తక్కువ మొత్తం అవసరమైతే ఈ లోన్ల కోసం బ్యాంక్, ఎంఎఫ్​ఐ లేదా నాన్​-బ్యాంక్​ఫైనాన్స్​ కంపెనీ (ఎన్​బీఎఫ్​సీ)లను సంప్రదించవచ్చు. పీఎంఎంవై కింద ఇవి మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ & రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ (ముద్రా) లోన్లను ఇస్తాయి.

అవసరమైన డాక్యుమెంట్లు

  • 1. లోన్ దరఖాస్తుదారు సెల్ఫ్​ అటెస్ట్​​ చేసిన ప్రూఫ్​తోపాటు 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లతో కూడిన ముద్ర లోన్ అప్లికేషన్.
  • 2. ఇది వరకటి ఫైనాన్షియల్​ రిజల్ట్స్​, దరఖాస్తుదారుడి వివరాలు, బిజినెస్​ ప్రొఫైల్​కు సంబంధించిన సమాచారంతో కూడిన లోన్​ అప్లికేషన్​.
  • 3. పెట్టబోయే బిజినెస్​ సంబంధించిన సరఫరాదారుల సమాచారంతోపాటు యంత్రాల రకాలు, ఇతర వస్తువుల వివరాలు
  • 4. వ్యాపార యాజమాన్యం, వ్యాపార చిరునామా ఐడెండిటీ ప్రూఫ్​లు
  • 5. బిజినెస్​ చేసేందుకు అవసరమైన లైసెన్స్‌లు, డాక్యుమెంట్ల కాపీలు.

పీఎంఎంవై కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహాయంతో పీఎంఎంవై కింద ముద్రా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ముద్రా లోన్ కోసం ఇలా దశలవారీగా దరఖాస్తు చేయాలి.

  • 1. ముందుగా ముద్రా లోన్ పొందాలనుకుంటున్న బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను ఎంచుకోండి.
  • 2. మీ వ్యక్తిగత, ఉద్యోగ వివరాలను అందిస్తూ బేసిక్​ ముద్రా లోన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
  • 3. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్ వంటి మీ కేవైసీ డాక్యుమెంట్లను ఇతర అవసరమైన డాక్యుమెంట్లతో పాటు సమర్పించండి.
  • 4. మీకు ఇప్పటికే వ్యాపారం ఉంటే, మీరు మీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టు రుజువులు తప్పనిసరిగా అందించాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Mudra loans for small businesses"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0