Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NEET UG 2022 Application

 ఏప్రిల్ 10న నీట్ నోటిఫికేషన్...జూలై లో ఎగ్జామ్

NEET UG 2022 Application


NEET UG 2022 Application: నేషనల్ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ - అండర్‌గ్రాడ్యుయేషన్‌ కు సంబంధించిన నోటపికేషన్‌కు టైం వచ్చింంది.

ఆదివారం అంటే ఏప్రిల్‌ 10న విడుదల చేయనున్నారు అధికారులు

జులైలో దీనికి సంబంధించిన పరీక్ష నిర్వహంచనున్నట్టు ఇప్పటికే అధికారులు ప్రకటించారు.

ప్రక్రియ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని కూడా వివరించారు.

ఒకసారి NEET UG 2022 నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దాన్ని అధికారిక వెబ్‌సైట్‌ nta.ac.in, neet.nta.nic.in. ల్లో పెడతారు.

ఈ రెండు వెబ్‌సైట్స్‌ నుంచి దేని నుంచైనా అభ్యర్థులు లాగిన్ అవ్వాలి. తర్వాత తమ వివరాలు అందులో పొందుపరచాలి.

వ్యక్తిగత, విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

NEET UG 2022 ని జులై 17 నిర్వహిస్తారని... షెడ్యూల్ విడుదల చేసినట్టు ఓ ఫేక్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని నమ్మి కంగారు పడొద్దని ఇప్పటికే ఎన్‌టీఏ ప్రకటించింది.

నీట్ పరీక్ష విధానం

నీట్‌లో 180 ప్రశ్నలు ఇస్తారు.

ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీపై ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్ట్‌ను రెండు విభాగాలుగా చేసి ప్రశ్నలు అడుగుతారు.

ఏ విభాగంలో 35 ప్రశ్నలు అడుగుతారు.అందులో అన్నింటికీ ఆన్సర్స్ రాయాలి.

రెండో విభాగంలో 15 ప్రశ్నలు అడుగుతారు. వాటిలో 10 ప్రశ్నలకు జవాబులు రాస్తే చాలు. మిగతా ఐదు ఛాయిస్‌లో వదిలేయవచ్చు.

నీట్‌ యూజీ 2022 అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి

1. ntaneet.nic.in వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి.

2. ముందుగా విద్యార్థి పేరు, తండ్రిపేరు, ఫోన్‌ నెంబర్‌ వివరాలు ఇచ్చి ఐడీ క్రియేట్ చేసుకోవాలి.

3. అలా క్రియేట్ చేసుకున్న లాగిన్ ఐడీతో లాగిన్అవ్వాలి.

4. అందులో ఉన్న అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అందులో విద్యార్హతలు, మార్క్‌ల వివరాలు, పొందుపరచాలి.

5. డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్ చేయాలి, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్‌ , సంతకాన్ని స్కాన్ చేసి జత చేయాలి.

6. తర్వాత అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో మోడ్‌లో పే చేయాలి.

7. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఒకటికి రెండు సార్లు సరి చూసుకొని అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి.

8. అనంతరం అప్లికేషన్‌ను డౌన్‌లౌడ్‌ చేసి ఒక ప్రింట్‌ అవుటు ఒకటి తీసి పెట్టుకోవాలి.

నీట్‌ యూజీ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే?

పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను జేపీజీలో కానీ, జేపీఈజీ ఫార్మాట్‌లో కానీ 10 కేబీ నుంచి 200 కేబీ మధ్య ఉండేలా రెడీ చేసుకోవాలి.

2. అదే మాదిరిగా అభ్యర్థి సంతకాన్ని కూడా స్కాన్ చేసి జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్‌లో 4 కేబీ నుంచి 30 కేబీ మధ్య ఉండేలా పెట్టుకోవాలి.

3. అభ్యర్థి ఎడమచేతి వేలి ముద్ర కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా జేపీజీ ఫార్మాట్‌లోనే ఉండాలి. 10 కేబీ నుంచి 50 కేబీ మధ్యలో ఉండాలి.

4. పదోతరగతి పాస్‌ సర్టిఫికేట్‌ జేపీజీ ఫార్మాట్‌లో 100 కేబీ నుంచి 300 కేబీ మధ్యలో ఉండేలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NEET UG 2022 Application"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0