North Eastern Railway Recruitment 2022
Indian Railways: రైల్వేలో రాత పరీక్ష లేకుండా గ్రూప్ సీ ఉద్యోగాలు.క్రింద తెలియపరచిన అర్హతలుంటే చాలు.
ప్రధానాంశాలు:
- నార్త్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్
- 21 గ్రూప్-సీ పోస్టుల భర్తీకి ప్రకటన
- ఏప్రిల్ 25 దరఖాస్తులకు చివరితేది
North Eastern Railway Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గోరఖ్పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్ ఈస్టర్న్ రైల్వే (NER).. స్పోర్ట్స్ కోటా ద్వారా గ్రూప్ సీ పోస్టుల (Group C posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 21 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఒలంపిక్ గేమ్స్, వరల్డ్ కప్, వరల్డ్ ఛాంపియన్షిప్, కామన్వెల్త్ గేమ్స్, ఛాంపియన్స్ ట్రోపీలో పాల్గొని ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే పూర్తి వివరాలకు https://ner.indianrailways.gov.in/ వెబ్సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: స్పోర్ట్స్ కోటా ద్వారా గ్రూప్ సీ పోస్టులు
క్రీడల లిస్టు: క్రికెట్, కబడ్డీ, బాస్కెట్ బాల్, హాకీ, వాలీవాల్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ తదితర క్రీడలు.
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఒలింపిక్ గేమ్స్, వరల్డ్ కప్, వరల్డ్ ఛాంపియన్షిప్, కామన్వెల్త్ గేమ్స్, ఛాంపియన్స్ ట్రోపీలో పాల్గొని ఉండాలి.
ఎంపిక విధానం: ఫీల్డ్ ట్రయల్స్, సాధించిన పతకాలు, విద్యార్హతల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
జనరల్ అభ్యర్ధులకు: రూ. 500 ఎస్సీ/ఎస్టీ/బీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు: రూ. 250
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2022
పూర్తి వివరాలకు వెబ్సైట్:https://ner.indianrailways.gov.in/
0 Response to "North Eastern Railway Recruitment 2022"
Post a Comment