Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Plastic: The plastic demon that devours mankind. Identification of plastic particles in the lungs

 Plastic : మానవళిని కబలిస్తోన్న ప్లాస్టిక్ భూతం.  ఊపిరితిత్తుల్లో ప్లాస్టిక్ రేణువుల గుర్తింపు 

Plastic: The plastic demon that devours mankind.  Identification of plastic particles in the lungs

Plastic: ప్లాస్టిక్‌ భూతం.. సమస్త మానవాళిని కబలిచ్చేస్తోంది. రోజురోజుకీ పెరుగుతోన్న ప్లాస్టిక్‌ వినియోగం కొండలా పేరుకుపోతోంది. ప్లాస్టిక్‌ వినియోగం అనివార్యంగా మారుతోన్న తరుణంలో మానవ ఉనికినే ప్రశ్నర్థాకంగా మార్చేస్తోంది.

మొన్నటి వరకు సముద్రాలు, నదుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు మానవ శరీరంలోకి చేరుతోన్న ప్లాస్టిక్‌ గురించి మాట్లాడుకునే రోజులు వచ్చాయి. మొన్నటికి మొన్న మనుషుల రక్తంలో ప్లాస్టిక్‌ రేణువులను గుర్తించిన శాస్త్రవేత్తలు ఇప్పుడు ఊపిరితిత్తుల్లో కనుగొన్నారు.

ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ హల్‌కు చెందిన హల్‌యార్క్‌ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఊపిరిత్తుల్లో సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులను గుర్తించారు. మనిషి గాలి పీల్చుకునే సమయంలో ప్లాస్టిక్‌ రేణువులు లోపలికి ప్రవేశిస్తున్నాయని, అనంతరం అవి ఊపిరితిత్తుల్లో తిష్ట వేస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీంతో శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు హెచ్చరించారు. కంటికి కనిపించని సూక్ష్మమైన ప్లాస్టిక్‌ రేణువులు పీల్చేగాలి. తాగే నీటి ద్వారా శరీరంలోకి చేరుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు 13 లంగ్‌ టిష్యూ నమూనాలను పరిశీలించారు, ఇందులో 11 నమూనాల్లో 39 మైక్రో ప్లాస్టిక్‌ రేణువులను గుర్తించారు. ఇప్పటికే రక్తంలో ప్లాస్టిక్‌ రేణువులను గుర్తించిన పరిశోధకలు ఊపిరితిత్తుల్లో కనుగొనడం ఇదే తొలిసారి. ప్లాస్టిక్‌ వాడకానికి అడ్డుకట్ట పడకపోతే భవిష్యత్తుల్లో ఇంకా ఎలాంటి పరిస్థితితులు చూడాల్సి వస్తాయో అన్న భయాలు మొదలయ్యాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Plastic: The plastic demon that devours mankind. Identification of plastic particles in the lungs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0