Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Pradhan Mantri Awas Yojana Scheme (PMAY)

 PMAY : కేంద్రం సూపర్ స్కీమ్ .. సొంతింటి కలను సులువుగా నెరవేర్చుకునే ఛాన్స్ !

Pradhan Mantri Awas Yojana Scheme (PMAY)

PMAY: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

దాదాపుగా ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను మొదలుపెట్టింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గం(ఈడబ్ల్యూఎస్) కు చెందిన చెందిన వాళ్లలో కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కు అర్హులు.

తక్కువ ఇన్‌కమ్ గ్రూప్(ఎల్ఐజీ) కు చెందిన వాళ్లు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల మధ్య ఆదాయం ఉంటే ఈ స్కీమ్ కు అర్హులు. మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ 1 (ఎంఐజీ1) లబ్ధిదారులు రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఆదాయం ఉంటే అర్హులు కాగా మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ 2 (ఎంఐజీ 2) లబ్ధిదారులు ఆదాయం రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉంటే అర్హత కలిగి ఉంటారు. ఆదాయ రుజువు కార్డ్, అడ్రస్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

గృహా రుణాలపై వడ్డీ రాయితీలను అందించడం కేంద్రం ఈ స్కీమ్ ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావించే వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తోంది. http://pmaymis.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో 'సిటిజన్ అసెస్‌మెంట్' అనే ఆప్షన్ ను క్లిక్ చేసి ఆధార్ వివరాలను ఎంటర్ చేసి క్యాప్చా కోడ్‌, ఇతర వివరాలను ధృవీకరించి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా ఈ స్కీమ్ కొరకు సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అర్హతలను తనిఖీ చేసుకుని ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ స్కీమ్ ద్వారా లబ్ధిదారులకు 2.67 లక్షల రూపాయల వరకు వడ్డీ రాయితీ లభిస్తోంది.

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కోసం అప్లై చేయడానికి అవసరమైన సర్టిఫికేట్స్.

  • ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్.
  • చిరునామా నిరూపణ.
  • ఆదాయ రుజువు కార్డ్. (బ్యాంక్ ఖాతా స్టేట్ మెంట్, ఐటీ రిటర్న్స్)

నియమాలు.

  • ఆర్థికంగా వెనుకబడిన విభాగం (EWS): మీ కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు.
  • దిగువ ఆదాయ సమూహం (LIG): వార్షిక కుటుంబ ఆదాయం రూ.3 లక్షల నుండి రూ. 6 లక్షలు.
  • మధ్య ఆదాయ సమూహం (MIGలు): వార్షిక కుటుంబ ఆదాయం రూ.6 లక్షల నుండి రూ. 18 లక్షలు.
  • మురికి వాడలలో నివసించేవారు.

ఎలా అప్లై చేయాలో వివరణ

  • PMAYకి అర్హత పొందిన వర్గాన్ని గుర్తించాలి.
  • అధికారిక వెబ్‌సైట్‌ http://pmaymis.gov.in.లాగిన్ కావాలి.
  • ప్రధాన మెనూ కింద ఉన్న ‘సిటిజన్ అసెస్‌మెంట్’పై క్లిక్ చేసి, దరఖాస్తుదారు వర్గాన్ని ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత ఓపెన్ అయిన పేజీలో ఆధార్ వివరాలను ఎంటర్ చేయాలి.
  • వ్యక్తిగత, ఆదాయం, బ్యాంక్ ఖాతా వివరాలు, ప్రస్తుత నివాస చిరునామాతో ఆన్‌లైన్ PMAY అప్లికేషన్‌ను పూర్తిచేయాలి.
  • క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. సరైన వివరాలను ధృవీకరించండి. తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఆఫ్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే కామన్ సర్వీస్ సెంటర్ (CSC)లో ఒక ఫారమ్‌ను పూరించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పథకం కింద ప్రయోజనాలను పొందడానికి ఏ ప్రైవేట్ వ్యక్తులు లేదా కంపెనీలు డబ్బును సేకరించడానికి అనుమతించబడదని గమనించాలి.
మీరు ఏదైనా బ్యాంక్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీని కూడా సందర్శించవచ్చు, పథకం దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయాలి.
మీరు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఫారమ్‌లో చూపించిన పత్రాలను సమర్పించాలి, మీ అర్హతను తనిఖీ చేయాలి.

గమనిక: – ‘సిటిజన్ అసెస్‌మెంట్’ కింద ‘ట్రాక్ యువర్ అసెస్‌మెంట్ స్టేటస్’పై క్లిక్ చేయడం ద్వారా మీరు అప్లికేషన్ స్థితిని తర్వాత ట్రాక్ చేయవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Pradhan Mantri Awas Yojana Scheme (PMAY)"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0