Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sri Ram Navami

 Sri Ram Navami 2022 : శ్రీరామనవమి సందర్భంగా ఏ పనులు చేయాలి .. ఏవి చేయకూడదు.

Sri Ram Navami 2022: ఏప్రిల్ 2 నుంచి మొదలైన చైత్ర నవరాత్రులు శ్రీరామనవమితో ముగుస్తాయి. నవరాత్రులలో భాగంగా దుర్గాదేవిని తొమ్మిది అవతారాలలో కొలుస్తారు.

తొమ్మిదో రోజున రామ నవమి అని పిలుస్తారు. దీనిని శ్రీరాముని జ్ఞాపకార్థం జరుపుకుంటారు. ఈ సంవత్సరం రామ నవమి ముహూర్తం ఏప్రిల్ 10వ తేదీ తెల్లవారుజామున 1:32 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 11వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ముగుస్తుంది. నవరాత్రులు సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు. మార్చి లేదా ఏప్రిల్‌లో చైత్ర నవరాత్రులు జరుపుకుంటారు. అలాగే అక్టోబర్-నవంబర్‌లో దుర్గా నవరాత్రులు నిర్వహిస్తారు. ఇవి దసరాతో ముగుస్తాయి. అయితే నవరాత్రులలో ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం.

నవరాత్రులలో చేయాల్సిన పనులు

1. అన్ని నవరాత్రి రోజులలో అఖండ దీపాన్ని వెలిగించాలి.

2. ఇది సాధ్యం కాకపోతే పండుగ ముగిసే వరకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం హారతి ఇవ్వాలి.

3. అన్ని నవరాత్రి రోజులలో దుర్గా చాలీసా, దుర్గా సప్తసతి పఠించాలి.

4. ఉపవాసం ఉన్నప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ, గ్రీన్ టీలని తీసుకోవాలి.

5. మీరు పని చేసే వృత్తినిపుణులైతే బాదం, వాల్‌నట్‌లు, పిస్తా వంటి కొన్ని గింజలను తీసుకెళ్లడం మంచిది. పెరుగు, మజ్జిగ, పనీర్, ఇతర మొక్కల ఆహారాల నుంచి ప్రోటీన్ పొందాలని గుర్తుంచుకోండి.

6. నవరాత్రులలో ఎటువంటి తప్పులు చేయకూడదు. దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నవరాత్రులలో చేయకూడని పనులు

1. మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

2. ఉల్లిపాయలు, వెల్లుల్లి తినడం మంచిది కాదు. వీలైతే ఇవి లేకుండా వంటలు వండాలి.

3. నవరాత్రి రోజులలో జుట్టును కత్తిరించుకోవద్దు. షేవింగ్ చేసుకోవద్దు.

4. సాత్విక జీవనశైలిని గడపడానికి ప్రయత్నించండి.

5. పూజ సమయంలో ఎవరైనా ఎలాంటి బెల్ట్, చెప్పులు-బూట్లు లేదా తోలుతో చేసిన వస్తువులను ధరించకూడదు. 6. నవరాత్రులు తొమ్మిది రోజుల్లోనూ ఎవరిని బాధపెట్టవద్దు, ఎవరితోనూ అబద్దం చెప్పొద్దు.

7. నవరాత్రి సమయంలో శారీరక సంబంధాలు మానుకోండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sri Ram Navami "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0