Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The beginning of the month of Ramjan

రంజాన్ నెల ప్రారంభం.


           🌙🕋🕌🤲పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఉపవాస దీక్షలకు ఉపక్రమించిన ముస్లిం సోదరులకు "రంజాన్ మాసం ప్రారంభోత్సవ శుభాకాంక్షలు"

 అతి పవిత్రం.రంజాన్ మాసం

 సమత, మమతల  సమ్మిళితాన్ని చాటిచెప్పే అతి పవిత్రమైన పండుగ రంజాన్. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్ అవతరించడంతో ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ నెల14 నుండి  రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం అవుతాయి. ప్రపంచంలోని ముస్లింలు అతి పవిత్రంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ రంజాన్ వేడుక. నెలవంక దర్శనంతో దీక్షలు చేపట్టి తిరిగి నెలవంక దర్శనంతో దీక్ష ని  విరమిస్తారు . నెలరోజుల ఉపవాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పవిత్ర ఖురాన్ అవతరించిన మాసం కావడంతో ఈ ఏడాదిలో ఈ నెలకు  ఎంతో ప్రాధాన్యత ఉంటుంది   . ఈ మాసంలో వచ్చే ఒక రాత్రి 1000 నెలల కంటే శ్రేష్ఠమైనది గా భావిస్తారు.  రంజాన్ మాసం అంటే ఇది బాహ్య సౌందర్యాలకు తావివ్వక ,ఆత్మ సౌందర్యానికి పట్టం కట్టే అరుదైన పండుగ .ఒక మహత్తరమైన వేడుక .ఎదనిండా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే సంతోషాల పండగ. సంబరాల వేదిక. వ్యక్తిని అతని వ్యక్తిత్వాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దే కఠినతరమైన ఆధ్యాత్మిక మార్గం. నెలరోజులపాటు ఉపవాసం ఉన్న వారిలో సప్త వ్యసనాలను తొలగించి ఇతరుల పట్ల దయ, కరుణ, ప్రేమ, వాత్సల్యాలను పెంపొందిస్తాయని నమ్ముతారు. ఉపవాస దీక్ష మానసిక, శారీరక, ఆధ్యాత్మిక వికాసానికి దోహద పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సాధారణ వ్యక్తి జీవితాన్ని సమాజానికి ఉపయోగపడే సద్గుణాలను నింపి సోదర భావాన్ని కలిగిస్తుంది. ఇదే ఇస్లాం మూల  సూత్రాల్లో ప్రధానమైన లక్ష్యం .రంజాన్ మాసం సందర్భంగా నెలరోజులపాటు ముస్లింలు  ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను పాటిస్తారు. అల్లా కు దీక్షా పరుడి మధ్య ఉన్న అతి రహస్యమైన దీక్షగా దీనిని పేర్కొంటారు. పవిత్ర ఖురాన్ అవతరించడంతో ఈ నెల కు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు .నెలరోజులపాటు ఉపవాసముండేవారు కఠోరమైన దీక్షతో దీక్షలను చేపట్టాలి . తెల్లవారుజామున సహరి సాయంత్రం ఇఫ్తార్ తో ఉపవాస దీక్ష ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో ఎటువంటి పదార్థాలు గాని పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఈ పవిత్రమైన, కఠోరమైన దీక్షను పాటించాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఐదుపూటల నమాజ్ చేయటం తో పాటు రాత్రి వేళల్లో తరావీహ్ నమాజ్ తప్పనిసరిగా పాటించాలి. ఈ నెలలో చేసే నమాజు లకు పవిత్ర కార్యాలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని  పవిత్ర ఖుర్ఆన్ పేర్కొంటోంది. ప్రతి ముస్లిం కూడా విధిగా రంజాన్ ఉపవాస దీక్షలు పాటించాలని ఖుర్ఆన్ పేర్కొంటోంది. రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండేవారికి  సమాజ సేవ  పట్ల అంకితభావం, నిరుపేదల పట్ల సేవ చేయాలనే సంకల్పం, సన్మార్గంలో  నడిచే ఒక అద్భుత అవకాశం   ఈ ఉపవాసాల దీక్షల వల్ల కలుగుతుందని చెబుతారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The beginning of the month of Ramjan"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0