Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ugadi subhaakaamkshalu.

 శిశిరం తరువాత వచ్చే వసంతకాలంలోని తొలి పండుగ ఉగాది (Ugadi 2023). ఉగాది రోజే తెలుగు సంవత్సరాది మొదలవుతుంది. ఆ రోజున ఉదయం లేవడంతోనే ఉగాది శుభాకాంక్షలను బంధు మిత్రులకు పంపించడం మొదలుపెడతారు.

Ugadi subhaakaamkshalu.

అలా పంపించేందుకు కొన్ని చక్కటి సందేశాలు ఇవిగో.

1. తీపి, చేదు కలిసిందే జీవితం
కష్టం, సుఖం తెలిసిందే జీవితం
మీ జీవితంలో ఈ ఉగాది
ఆనందోత్సహాలు పూయిస్తుందని
మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

2. మామిడి పువ్వు పూతకొచ్చింది
కోయిల గొంతుకు కూత వచ్చింది
వేప కొమ్మకు పూవు మొలిచింది
పసిడి బెల్లం తోడు వచ్చింది
గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది
ఉగాది పండుగ రానే వచ్చింది
మీకు మీ కుటుంబసభ్యులకు

శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

3. కష్టాలెన్నైయినా రానీయండి
సవాళ్లెన్నైనా ఎదురవనీయండి
కలిసి నిలుద్దాం, గెలుద్దాం
ఈ సంవత్సరం మీకు అన్నింట్లో గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ...
శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

4. మధురమైన ప్రతి క్షణం
నిలుస్తుంది జీవితాంతం
ఈ కొత్త ఏడాది
అలాంటి క్షణాలనెన్నో
మీకు అందించాలని కోరుకుంటున్నాను.
శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

5. కాలం పరుగులో మరో మైలురాయి
ఈ కొత్త ఏడాది...
ఈ ఏడాదంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ
శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

6. ఈ ఉగాది మీకు
ఉప్పొంగే ఉత్సాహాలను
చిగురించే సంతోషాలను
విరబూసే వసంతాలను
అందించాలని ఆకాంక్షిస్తూ
శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

7. జీవితం సకల అనుభూతలు సమ్మిశ్రమం
అదే ఉగాది పండుగ సందేశం.
మీకు మీ కుటుంబసభ్యలకు
శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

8. చీకటిని తరిమే ఉపోదయంలా
చిగురాలకు ఊయలలో నవరాగాల కోయిలలా
అడుగు పెడుతున్న ఉగాదికి స్వాగతం.
ఈ ఏడాది మీకంతా మంచే జరగాలని కోరుతూ
శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

9. లేత మామిడి ఆకుల తోరణాలు
శ్రావ్యమైన కోయిల రాగాలు
అందమైన ముగ్గులు
కొత్త వస్త్రాలతో కళకళలాడిపోతున్న పిల్లలు
ఉగాది పండుగ సంబరాలు ఎన్నో.
శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

10. మన సాంప్రదాయాలను గుర్తుచేస్తూ వచ్చిన ఈ ఉగాది పండు అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటూ...
శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

11. కొత్త ఆశలు
కొత్త ఆశయాలు
కొత్త ఆలోచనలతో
ఈ ఉగాది నుంచి
మీ జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ
శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

12. ఈ కొత్త ఏడాది మీ జీవితంలో
విజయాలను, సంపదను, సంతృప్తిని
సమృద్దిగా తీసుకురావాలని ఆశిస్తూ
శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఆ ఆరు రుచులు ఇవే...
ఉగాదినాడు కచ్చితంగా తయారుచేయాల్సిన ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి. అవి తీపి, కారం, పులుపు, ఉప్పు, వగరు, చేదు. తీపికి బెల్లాన్ని, కారానికి పచ్చిమిర్చిని (కొంతమంది కారం వాడుకుంటారు), పులుపుకి చింతపండు (నిమ్మకాయ కూడా వాడుకోవచ్చు), ఉప్పు, వగరుకి మామిడి కాయని, చేదు వేపుపువ్వుని వాడడం ఆనవాయితీగా వస్తోంది. జీవితంలోని కష్టసుఖాలకు, జరగబోయే మంచి చెడులను ఈ రుచులు సూచిస్తాయని అంటారు. ఉగాది పచ్చడి తిన్నప్పుడు తీపి తగిలితే ఆ ఏడాదంతా సాఫీగా, ఆనందంగా సాగుతుందని భావిస్తారు ప్రజలు. అలాగే చేదు తగిలితే కష్టాలు తప్పవని, పులుపు కష్టం సుఖం కలిసే వస్తాయని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఉగాది పచ్చడి తయారీ పూర్వాకాలం నుంచి వస్తున్న పద్దతి ఇది.

ఉగాది పచ్చడికి (Ugadi Chutney) కావాల్సిన పదార్థాలు:
బెల్లం, చింతపండు, మామిడికాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, నీళ్లు, వేప పువ్వు.
(కొంతమంది కొబ్బరి ముక్కలు, జామ ముక్కలు, అరటిపండు కూడా కలుపుకోవచ్చు)

తయారీ ఇలా
1. మిరపకాయను, బెల్లాన్ని, మామిడికాయను తురుముకోవాలి.
2. వేప పూవును నీళ్లలో కడిగి శుభ్రం చేసుకోవాలి.
3. చింతపండును కాస్త నీళ్లలో నానబెట్టాలి.
4. చింతపండు పిప్పిని తీసి పడేసి ఆ రసాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
5. ఆ చింతపండు నీళ్లలో ఉప్పు, మామిడి తురుము, బెల్లం తురుము, పచ్చి మిరపకాయ తురుము,వేపపువ్వు తురుము వేసి కలుపుకోవాలి.
6. వేప పువ్వును అధికంగా వేయకూడదు. చేదు ఎక్కువైపోతుంది.
7. మీకు కావాలనుకుంటే కొబ్బరి ముక్కలు, అరటి పండు ముక్కలు, జామ ముక్కలు కూడా కలుపుకోవచ్చు.

ఉగాది అంటే.
ఉగ అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అనే అర్థాలు ఉన్నాయి. ఇక ఆది అంటే మొదలు అంటారు. వాటన్నింటికీ మొదలు ఈ 'ఉగాది'. శిశిర రుతువు తరువాత వచ్చేది వసంతం. ఈ కాలంలోనే చెట్లు చిగుర్లు పెట్టి ప్రకృతి అందంగా ఉంటుంది. వసంతకాలంలోనే ఉగాది పండుగ వస్తుంది. తెలుగు సంవత్సరం మొదలయ్యేది ఉగాది రోజే కాబట్టి ఇదే తెలుగువారి తొలి పండుగ.

అందరికీ శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ugadi subhaakaamkshalu."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0