Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aim for cyber victims again on the web

సైబర్‌ బాధితులపై మళ్లీ వల.గూగుల్‌లో నంబర్లు వెదికే వారిపైనే గురి

Aim for cyber victims again on the web

  • ఫిర్యాదుల కోసం నకిలీ వెబ్‌సైట్ల సృష్టి
  • గూగుల్‌లో నంబర్లు వెదికే వారిపై గురి
  • పోలీసుల్లా వివరాలడిగి ఖాతాల లూటీ

 సైబర్‌ నేరగాళ్లు ముదిరిపోతున్నారు. ఒకసారి తమ వలలో చిక్కినవారిపై కొత్త తరహాలో మళ్లీ మళ్లీ వల విసురుతున్నారు. సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయిన కొంతమంది బాధితులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కాంటాక్ట్‌ నంబర్ల కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. ఇలాంటివారిని నకిలీ వెబ్‌సైట్లు, నకిలీ కాల్‌సెంటర్ల ద్వారా మరోసారి బురిడీ కొట్టిస్తున్నారు సైబర్‌ కేటుగాళ్లు. సైబర్‌ బాధితుల ఫిర్యాదుల కోసం తాము సృష్టించిన నకిలీ వెబ్‌సైట్లలో నకిలీ కాంటాక్ట్‌ నంబర్లు ఉంచుతున్నారు.

వాటికి ఎవరైనా ఫోన్‌ చేస్తే.. మోసపోయిన సొమ్మను రికవరీ చేస్తామని నమ్మించి, బాధితుల బ్యాంకు ఖాతా, ఫోన్‌ నంబర్‌, అడ్రస్‌, ఆధార్‌ నంబర్‌, సీవీవీ ఇలా అన్ని వివరాలు కాజేస్తున్నారు. వీటిని ఉపయోగించి మరోమారు డబ్బులు కొట్టేస్తున్నారు. అది సాధ్యం కాకపోతే ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర ఖర్చుల పేరుతో అందినకాడికి గుంజుతున్నారు. గత పది రోజుల్లో ఈ తరహాలో ఐదు ఫిర్యాదులు అందడంతో తెలంగాణ సైబర్‌ క్రైం పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆరు నకిలీ వెబ్‌సైట్లను గుర్తించారు. వాటిని నమ్మొద్దని హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకొన్న బాధితులు 1930 లేదా 155260 నంబర్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

పోలీసులు గుర్తించిన నకిలీ వెబ్‌సైట్లు

www.consumercomplaints.info

www.complaintroom.in

www.onlinelegalindia.com

www.consumerchanakya.com

www.goindialegal.com

www.janasurakshakendra.in


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Aim for cyber victims again on the web"

Post a Comment