Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Akshaya Tritiya

 Akshaya Tritiya 2022 : అక్షయ తృతీయ రోజున ఈ 7 తప్పులు అస్సలు చేయోద్దు.ఎందుకో వివరణ.

Akshaya Tritiya


Akshaya Tritiya: అక్షయ తృతీయ అంటేనే ఓ మంచి ముహూర్తంగా జోతిష్య నిపుణులతోపాటు పెద్దలు చెబుతుంటారు. హిందూవులకు ఎంతో పవిత్రమైన ఈరోజున ఎక్కువగా పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు, కొత్త వ్యాపారాలు, కొనుగోళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభాకార్యాలన్నీ చేస్తుంటారు.

అయితే, వీటిలో కొనుగోళ్లకు అక్షయ తృతీయ మంచిదని చెబుతుంటారు. ముఖ్యంగా ఈరోజున బంగారం కొనుగోలు చేస్తే ఎంతో మంచిదని చెబుతుంటారు. అక్షయ తృతీయ పండుగ వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున వస్తుంది. హిందూ మతం విశ్వాసాల ప్రకారం, అక్షయ తృతీయ పవిత్రమైనది. అక్షయ తృతీయ ఈ సంవత్సరం మే 3 మంగళవారం రోజున వచ్చింది. ఇలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీ దేవి కోపానికి గురవుతుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రోజున ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అక్షయ తృతీయ నాడు లక్ష్మి దేవీ సమేతంగా విష్ణుమూర్తిని పూజించాలి. ఈ పూజలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. ఇటువంటి పరిస్థితిలో, తులసి ఆకులను కోసేముందు, పూజ తర్వాత తీసే ముందు శారీరక పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్నానం చేయకుండా తులసి ఆకులను తీయడం మర్చిపోవద్దు.

2. అక్షయ తృతీయ రోజున ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి రావడం చాలా అశుభం. వీలైతే, వెండి లేదా బంగారు ఆభరణాలతో మాత్రమే ఇంటికి రావాలని పెద్దలు చెబుతుంటారు. ఖరీదైన ఆభరణాలు కొనడం సాధ్యం కాకపోతే, మీరు మెటల్‌తో చేసిన చిన్న వస్తువును కూడా ఇంటికి తీసుకురావచ్చు.

3. అక్షయ తృతీయ రోజున, కొంతమందికి తెలియకుండా కేవలం లక్ష్మిదేవిని మాత్రమే పూజిస్తారు. అయితే లక్ష్మీదేవిని విష్ణువుతో కలిపి పూజించాలి. ఇద్దరినీ విడివిడిగా పూజించడం వల్ల అశుభ ఫలితాలు ఉంటాయి. విష్ణుమూర్తిని లక్ష్మీ సమేతంగా పూజించడం వల్ల పునరుద్ధరణ పుణ్యం లభిస్తుందని చెబుతుంటారు.

4. అక్షయ తృతీయ రోజు స్నానం చేయకుండా సంపద ఉన్న స్థలాన్ని శుభ్రం చేయవద్దు. స్నానం చేయకుండా ఇంటి ఖజానాను ముట్టుకోవద్దు. ఇంట్లో స్వచ్ఛత పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. దీపావళి మాదిరిగా ఇంటిని శుభ్రం చేసి, సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద నూనె లేదా నెయ్యి దీపం వెలిగించండి.

5. అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఏ మూలన చీకటి పడకుండా చూసుకోండి. ఇంట్లో చీకటి ఉన్న చోట దీపం వెలిగించండి. ఇది కాకుండా తులసి మొక్క, లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల వారి కరుణ మీ ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది.

6. అక్షయ తృతీయ నాడు బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి. ఈ రోజు ప్రతీకార విషయాలకు దూరంగా ఉండండి. వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం మానుకోండి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి. ఎవరి పట్లా చెడు ఆలోచనలు లేదా కోపం తెచ్చుకోకండి.

7. అలాగే, పగటిపూట నిద్రపోకూడదు. పేదవాడు మీ ఇంటికి వస్తే, అతన్ని ఖాళీ చేతులతో వెళ్లనివ్వవద్దు. వారికి ఆహారం ఇవ్వండి లేదా దాతృత్వంలో ఏదైనా ఇవ్వండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Akshaya Tritiya "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0