Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP TRANSFERS:2022

AP TRANSFERS:2022

జూన్ లో జరుగు బదిలీలకు ప్రభుత్వం విధి విధానాలు.

AP TRANSFERS:2022:

2020 బదిలీల అనుభవాలని దృష్టి లో పెట్టుకుని ఈ సారి జరుగు బోవు బదిలీలకు విధి విధానాలు ఈ విధంగా నిర్ణయిస్తున్నారు.                 ®️ప్రస్తుతం బదిలీలకు ఉన్న కనీస సర్వీసు 2 సం| దీనిని 3 సం॥ లకు పెంచనున్నారు.

బదిలీలు విషయం లో 3 సం ల మినిమం సర్వీసు 6 సం గరిష్ట సర్విసుగా నిర్ణయించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల 2015 లో జరిగిన సాధారణ బదిలీల వారికి  కూడా స్థాన చలనం కలుగ నుంది.

 8 సం లు గరిష్టంగా సర్వీసు కేటాయించడం వల్ల పాఠశాల లోని ఉపాద్యాయుడు రిటైర్‌ అయినా లేక ప్రమోషన్‌ పొందిన లేక చని పోయిన  ఉపాద్యాయులు లేకుండా  ఏళ్ళ తరబడి పాఠశాలలు ఉండి పోతున్నాయి అనేది ప్రభుత్వ ఆలోచన. 

6 సం॥ ల సర్వీస్ ఈ సం" నుండి అమలు చేస్తే గనుక 2015 లో బదిలీ పొంది ఉన్న ఉపాద్యాయులు కూడా బదిలీ కావలసి ఉంటుంది.దీనికి ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకం కాక పోయిన జీరో సర్వీస్ ను కోరుతున్నాయి.

విలీన పాఠశాలల విషయం లో వసతుల లభ్యత ను బట్టి ఉపాద్యాయులు ఈ క్రింది విధంగా mapping చేయ బడతారు.

1. విలీన ప్రాధమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులు మాత్రమే ఉండి 3,4,5 తరగతులు విలీనం జరుగుతుంటే ఆ పాఠశాల లోని ఉపాద్యాయుడి కి గరిష్ట సర్వీస్ 8 సం లు నిండక పోతే ... అదే పాఠశాల లో కొనసాగుతారు లేక పోతే బదిలీ జరుపబడుతాడు

2. విలీన పాఠశాల లో ఇద్దరు  ఉపాద్యాయులు ఉండి ఇద్దరికి 8 సం లు నిండక పోతే సినియర్ ని మెర్జ్ అయిన పాఠశాలకు పంపి జూనియర్ ని ప్రాధమిక పాఠశాలలో ఉంచుతారు

3. విలీన ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాద్యాయులకు 8 సం లు నిండి ఉంటే ఆ ఇద్దరూ జూన్ లో జరిగే బదిలీలకు హజరు కావలసి ఉంటుంది. 1, 2 తరగతులకు బదిలీ ద్వారా కొత్త ఉపాద్యాయుడు ని నియమిస్తారు.

4. ప్రాధమిక పాఠశాలలో 1,2 తరగతుల లో 30 విద్యార్డులు 3,4,5 తరగతులలో 33 విద్యార్థులు ఉండి ఆ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు పని చేస్తూ ఉంటే జూనియర్ ని ప్రాధమిక పాఠశాలలో ఉంచి మిగిలిన ఇద్దరులో సినియర్‌ ని మెర్జ్ పాఠశాలకు పంపి మరో ఉపాద్యాయుడికి 8 సం నిండ ని పక్షం లో రెషనైలైజేషన్ ప్రక్రియ ద్వారా బదిలీ ప్రక్రియ జరుపుతారు. అంటే ఇక్కడ విలీన ప్రాథమిక పాఠశాల నుండి 3, 4, 5 తరగతు కనీసం 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అనే నియమాళి ని అనుసరించి.

5. విలీన ప్రాధమిక పాఠశాలలో 65 విద్యార్థులు ఉండి ముగ్గురూ ఉపాద్యాయులకు 8 సం॥ లు నిండి ఉంటే ఉన్నత పాఠశాలకు, ప్రాధమిక పాఠశాలకు బదిలీ ద్వారా కొత్త ఉపాద్యాయులు నియమించ బడతారు. అంటే 8 సం|| నిండిన ప్రతి ఉపాద్యాయుడిని ఏ ఒక్క సందర్భ లోను ఉంచ బడరు.

6. ఇటువంటి ప్రతి పాదన వల్ల విలీన ప్రాధమిక పాఠశాలలో అయితే సర్వీస్ జూనియర్ ఉంటారు లేక పోతే స్పేసిఫిక్ డిగ్రీ పట్టాలు పొందని LFL HM లే ఉంటారు కనుక రాబోవు 3 సం॥ ల వరకు మూత పడదని ఉద్దేశ్యం.LFL పదోన్నతికి ప్రభుత్వం ప్రస్తుతం గల విద్యార్థుల సంఖ్యను 150 నుండి 120 కి తగ్గించ నుంది.

సాధారణం బదిలీ లలో ఇచ్చే పాయింట్స్ విషయానికి వస్తే

  • Service దృష్ట్యా సం॥ నికి 0.5
  • స్పౌస్ కు 5 పాయింట్ లు
  • స్పేషల్ క్యాటగిరికి 5 పాయింట్లు
  •  స్టేషన్ పాయింట్ లు
  • 1. cat - 1 (16% HRA)-1 points
  • 2. cat-2(12% HRA)-2 points
  • 3. cat-3(10% HRA)-2 points
  • 4. cat-4(10% HRA without connecting road)-5 points 
  • 5.24% HRA తో ఉన్న పాఠశాలలు ఎక్కడా లేవు.
  • 6. 2021 లో బదిలీ పొందబడి ఇప్పుడు రేష్న్లైజెషన్ పోష్టు పోతుంటే పాత station పాయింట్లు కలుపుతారు. ఏది ఏమైనా ఈ సారి బదిలీలు SGT లకు శరాఘాతంగా మారనున్నాయి అనడం లో సందేహం లేదు.

బదిలీలకు ,' హేతు బద్దికరణ కు సరిపడ పోష్టులకు మాత్రమే బదిలీలకు ఉంచుతారు.అంటే ఒక జిల్లా లో 1600 మంది 8 సం " నిండి , మరో  80 మంది హేతు బద్దీకరణ లో ఉంటే 1680 పోష్టులను మాత్రమే బదిలీ కు చూపుతారు రిటైర్‌ అయినా చని పోయిన, ప్రమోషన్ పొందిన స్థానాలను చూపరు. ఈ స్థానాలలో చాలా వరకు ప్రభుత్వం బ్లాక్‌ చేసి ఎయిడెడ్ వాళ్ళ కు అమ్ముకునే పరిస్థితి ఉంది అనే వాళ్ళు కూడా లేక పోలేదు.

పై విషయాలని ఉపాద్యాయ సంఘాల ప్రతినిధులు సమన్వయ సమావేశం జరిపి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఉపాధ్యాయ సంఘ నాయకులు అంటున్నారు. కాని ఉపాధ్యాయ సంఘాలు అంటే నే ప్రభుత్వం అగ్గిమీద గుగ్గిలం లా ఉంది కనుక ప్రభుత్వం ఏమి నిర్ణయిస్తుందో చూడాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP TRANSFERS:2022"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0