Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aunt, sister .. nicknames for women .. why do we add the masculine name Ayya and say "Aunty, sister"?

  అత్త , అక్క అని స్త్రీలను పిలిచే పేర్లు  అయ్యా అనే పుంలింగం జోడించి " అత్తయ్యా , అక్కయ్యా " అని ఎందుకంటాము ?

Aunt, sister .. nicknames for women .. why do we add the masculine name Ayya and say "Aunty, sister"?

అప్పట్లో ప్రజలు తెలుగులో ఎక్కువగా మాట్లాడేవారు, కానీ ప్రస్తుతం కాలానుగుణంగా ప్రపంచంలో చాలా మార్పులు జరిగాయి. టీవీలు, స్మార్ట్ ఫోనులు, ఇంటర్నెట్లు ఎక్కువైపోయాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు ఎక్కువైపోయాయి. Dad, Grandpa, Mummy, Uncle, Aunty పదాలు ఎక్కువయ్యాయి. అమ్మ, నాన్న, బాబాయి, పిన్ని అనే పిలుపులు తగ్గిపోయాయి. 

మనం "అత్తయ్య , అక్కయ్య " అని ఎందుకంటాము అంటే...   అయ్య అన్నది సంస్కృతంలో "ఆర్యా" నుండి వచ్చిన పర్యాయ పదం. అయ్యా అనే పదం అర్థం వయసులో పెద్దవారు అని, పూజ్యనీయులు అని తెలుసు. కానీ వాడుక భాషలో అయ్యా అంటే నాన్న లేదా యజమానిని పని మనిషి పిలిచే పిలుపు అయిపోయింది.

"ఆర్యా"కు బదులుగా వాడుక భాషలో "అయ్యా" అని పిలవడం అలవాటుగా మారింది. కానీ ఇప్పుడు ఈ "అయ్య" అన్న పదం కొంతమంది పెద్దవాళ్లని పిలిచే బంధుత్వంలో కలపడం ఆనవాయితీగా మారింది. తాతయ్య, మామయ్య, అత్తయ్య, అక్కయ్య , అన్నయ్య - ఇలాగన్నమాట. వీళ్లందరూ బంధుత్వంలో పెద్దవాళ్లే కదా.

అలాగే అమ్మ అని చేర్చిన చోట చివరలో మనం ఇంక అయ్య అని చేర్చ లేము. ఉదాహరణకు: అమ్మమ్మ, నాయనమ్మ, మామ్మ, బామ్మ, అత్తమ్మ మొదలైనవి... 

కొన్ని ప్రాంతాల్లో మనం ఈ అయ్య పిలుపుకి కూడా "గారు" అని చేర్చడం సాధారణం ఐపోయింది. ఎలాగంటే...  తాతయ్యగారు , మామయ్యగారు, అత్తయ్యగారు, అక్కయ్యగారు, అన్నయ్యగారు, అమ్మగారు, అయ్యగారు అంటూ ఉంటారు. వారి వారి ప్రాంతాలను బట్టి వారు పెద్ద వారికి ఇచ్చే గౌరవం ఇలాగ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు స్టేజీల మీద ఉపన్యాసాలు ఇచ్చేవారు ఈ గారు అనే పదం ఉపయోగిస్తారు. ఈ "గారు" అన్నది బాగా దేశంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన పండితులను, చదువు చెప్పిన గురువులను ఇలా పిలిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. దగ్గరి బంధువులను ఇలాగ మర్యాదగా పిలవడం వల్ల కొంత దూరం పెరుగుతుందేమో అనిపిస్తుంది.

కొన్ని ప్రాంతాల్లో ఇంకొక అడుగు ముందుకేసి గౌరవంతో "అండీ" కూడా చేర్చుతారు. తాతయ్యగారండీ, మామయ్యగారండీ , అన్నయ్యగారండీ, అత్తయ్యగారండీ, అక్కయ్యగారండీ, అమ్మగారండీ, అయ్యగారండీ వగైరా. ఇవన్నీ మనం చిన్నప్పుడు విన్న పిలుపులే. ప్రస్తుతం నాకు తెలిసి ఇలాంటి పిలుపులు తగ్గిపోయాయి అనుకుంటున్నాను. బహుశా పెద్దవాళ్లకి, యజమానులకి "అతి మర్యాద" చెయ్యాలనే మన తాపత్రయమే భాషను మార్చుతోందా? ఏమో… మనకు ముందు ముందు ఈ పదాలు వినిపిస్తాయా ? ప్రాంతాన్ని బట్టి భాష, యాస మారుతోంది. ప్రస్తుతం ఈ ఇంటర్నెట్ యుగంలో ఉమ్మడి కుటుంబాలు లేవు, చదువుల కోసం, ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలలో, విదేశాలలో నివసించడం, అక్కడున్న పరిస్థితులకనుగుణంగా వారు మారి పోవడం జరుగుతుంది. మరి ఇలాంటి పిలుపులు ("అయ్య" "గారు" "అండీ" ) రాబోయే తరంలో వినబడతాయా ? మీరేమంటారు ? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియ చేయండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Aunt, sister .. nicknames for women .. why do we add the masculine name Ayya and say "Aunty, sister"?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0