Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Big Breaking: Paper Leak .. Narayana Head of Narayana Educational Institutions Arrested

 బిగ్ బ్రేకింగ్: పేపర్‌ లీక్‌.. నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్

Big Breaking: Paper Leak .. Narayana Head of Narayana Educational Institutions Arrested

మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను ఏపీ CID పోలీసులు మంగళవారం  కొండాపూర్‌లోని తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. పదవ తరగతి పేపర్ల‌ లీకేజీ ఇష్యూలో పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి ఇద్దరినీ నారాయణ సొంత బెంజ్ కారులోనే పోలీసులు ఏపీకి తరలిస్తున్నారు.

అయితే గత 4 రోజులుగా నారాయణ ఫోన్‌ స్విఛాప్‌ చేసి అజ్ఙాతంలో ఉన్నారు. ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా నారాయణ స్కూల్ నుంచి టెన్త్ పేపర్లు లీకైనట్లు గుర్తించారు. కేసులో ఇప్పటికే వైస్‌ ప్రిన్సిపల్ గిరిధర్‌తోపాటు మరో ఇద్దరు అరెస్ట్ చేశారు. అంతేగాకుండా నారాయణ, చైతన్య విద్యాసంస్థల పలు బ్రాంచ్‌ల నుంచి పేపర్స్‌ లీకైనట్టు పోలీసులు గుర్తించారు.

కాగా.. ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనప్పట్నుంచీ లీకుల బెడద ఎక్కువైన సంగతి తెలిసిందే. అయితే ఈ లీకేజీ వ్యవహారంలో నారాయణ విద్యాసంస్థల పాత్ర కూడా ఉందని గత కొన్ని రోజలుగా వార్తలు వచ్చాయి. ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే కార్పొరేట్లు కలిసి కావాలని చేసిన కుట్రగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంలోనే నారాయణను అదుపులోకి తీసుకున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Big Breaking: Paper Leak .. Narayana Head of Narayana Educational Institutions Arrested"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0