Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Do not force anyone to get the Kovid vaccine .. Supreme Court key orders

 కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ఎవరినీ బలవంతం చేయొద్దు. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Do not force anyone to get the Kovid vaccine .. Supreme Court key orders


Supreme Court on Covid-19 Vaccination: కోవిడ్ టీకాలు వేయించుకోమని ఏ వ్యక్తిని బలవంతం చేయకూడదని దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) స్పష్టంచేసింది.

ఈ విషయంలో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లోని నిబంధనను గౌరవించాలని సూచించింది. ప్రస్తుతంలో దేశంలో అమలు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ విధానం అసమంజసమైనది, ఏకపక్షంగా ఉందని చెప్పలేమంటూ పిటిషనర్ వాదనతో సుప్రీంకోర్టు విభేదించింది. అదే సమయంలో విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం రూపొందించిన పాలసిలో కొన్ని షరతులు విధించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. టీకాలు వేయని వ్యక్తులను బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించడాన్ని నిరోధించేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు విధించిన షరతులను ప్రస్తుత పరిస్థితుల కారణంగా రీకాల్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. కోవిడ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఇలాంటి ఆంక్షలు సరికాదని పేర్కొంది. అలాగే కోవిడ్-19 వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాలకు సంబంధించిన డేటాను బహిరంగపరచాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.

టీకాలను తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషనర్ డాక్టర్ జాకబ్ పులియేల్ తన పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తంచేశారు. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్‌లో మాజీ సభ్యుడైన ఆయన.. కోవిడ్ వ్యాక్సిన్ క్లీనికల్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను బహిర్గతం చేసేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరారు. భారత్‌లో ఇస్తున్న కోవిడ్ టీకాలపై సరైన పరిశోధనలు జరగలేదని, టీకాల వల్ల కలిగే దుష్ప్రభావాలకు సంబంధించిన డేటాను బయటపెట్టకపోవడం సరికాదంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.

Covid 19 Vaccine

వ్యాక్సిన్లు తీసుకోవాలని ఎవరినీ బలవంతం చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అదే సమయంలో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

తమ టీకాలకు సంబంధించిన డేటాను సంబంధింత ప్రభుత్వ రెగ్యులరేటర్‌కు అందజేసినట్లు కోవాగ్జిన్ టీకా ఉత్పత్తి సంస్థ భారత్ బయోటెక్, కోవీషీల్డ్ టీకా ఉత్పత్తి సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సుప్రీంకోర్టుకు తెలియజేశాయి. అయితే తమ పరిశోధనలను చిన్నబుచ్చేలా పిటిషనర్  ఉన్నట్లు అభ్యంతరం వ్యక్తంచేశాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Do not force anyone to get the Kovid vaccine .. Supreme Court key orders"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0